
భూభారతి దరఖాస్తులపై సమీక్ష
లింగంపేట: భూభారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు, క్షేత్ర స్థాయిలో విచారణ ఎంతవరకు వచ్చిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. శనివారం సాయంత్రం ఆయన లింగంపేట తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలోని 23 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు, విచారణ, పాజిటివ్, నెగెటివ్ ఉత్తర్వుల తయారీ విషయమై అన్ని క్షేత్ర స్థాయి టీమ్‌ల ప్రోగ్రెస్ గురించి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవో ప్రభాకర్, భూభారతి ప్రత్యేకాధికారి రాజేందర్ ఆయనకు వివరాలు తెలిపారు. దరఖాస్తుల విచారణ, ఉత్తర్వుల తయారీని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.