
పిడుగుపాటుతో గొర్రెల కాపరి మృతి
మాచారెడ్డి : వాడి శివారులో శ నివారం పిడుగుపాటుకు ఒక రు మరణించారు. వివరాలి లా ఉన్నాయి. ఫరీదుపేటకు చెందిన మదిర సురేశ్ (23) మదిర మహిపాల్ గొర్రెల మందను మేతకు తీ సుకువెళ్లారు. వాడి శివారులో మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలుకావడంతో చెట్టుకిందకు చేరారు. ఆ స మయంలో పిడుగు పడడంతో సురేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్పృహ కోల్పోయిన మహిపాల్‌ను స్థానికులు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని గ్రామస్తులు తెలిపారు. సురేశ్ స్వగ్రామం భిక్కనూరు మండలం మోటాటిపల్లి. నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుని ఫరీదుపేట గ్రామానికి ఇళ్లరికం వచ్చాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్నామని మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపారు.