
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ
దోమకొండ/తాడ్వాయి/పిట్లం/ఎల్లారెడ్డి/లింగంపేట : దోమకొండలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ముగ్గుపోసి భూమిపూజ చేశారు. 12 ఇళ్లకు ముగ్గుపోయగా, మిగతా లబ్ధిదారులు త్వరలో పనులు మొదలుపెట్టాలని వారు సూచించారు. తాడ్వాయిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అధికారులు మార్కింగ్ చేశారు. ఈసందర్భంగా ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలందరికి ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు.
పిట్లం మండలం కంభాపూర్, చిల్లర్గి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మండల పరిషత్ అధికారి కమలాకర్ భూమి పూజ చేశారు. ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ పనులను ఎంపీవో ప్రకాష్ పరిశీలించారు. గ్రామంలో మంజూరైన లబ్ధిదారులకు సంబంధించిన ఇళ్లకు ఎంపీవో భూమిపూజ చేసి మార్కింగ్ వేశారు. లింగంపేట మండలం లింగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎంపీడీవో నరేష్ మార్కింగ్ ఇచ్చారు. అర్హులపైన పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.ఈకార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ