
25 ఏళ్లుగా అంబలికేంద్రం నిర్వహణ
ఎల్లారెడ్డిరూరల్: పట్టణంలో 25 ఏళ్లుగా అంబలి కేంద్రం ఏర్పాటు చేస్తు కుడుముల సత్యనారాయణ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీరుస్తున్నాడు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ 2001లో కుడుముల సత్యనారాయణ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఈట్రస్టు ద్వారా ప్రతిఏడాది వేసవి కాలంలో పట్టణంలోని గాంధీచౌక్‌లో అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంబలి కేంద్రంలో తైదల పిండితో తయారు చేసిన అంబలిని అందరికి అందిస్తున్నారు. రోజుకు 20 కిలోల పిండితో తయారు చేసిన అంబలిని 800 మంది నుంచి వెయ్యి మందికి అందిస్తున్నారు. అంబలి కేంద్రంతో పాటు కరోనా సమయంలో సైతం కషాయాన్ని అందరికి అందించి ఆపదలో అండగా నిలిచారు. అంబలి తాగడంతో వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండడంతో పాటు శరీరంలోని ఉష్ణోగ్రత పెరగకుండా కాపాడుతుంది. దీంతో చాలా మంది అంబలి తాగేందుకు ఆసక్తి కనబరుస్తారు. ప్రజలకు అంబలిని అందిస్తు సత్యనారాయణ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
దాహార్తి తీరుస్తున్న
కుడుముల సత్యనారాయణ
కరోనా సమయంలోను
కషాయం అందజేత