
విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్‌మన్ మృతి
బోధన్ రూరల్: బోధన్ మండలంలోని రాజీవ్‌నగర్ తండాలో విద్యుత్ మరమ్మతులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురై అసిస్టెంట్ లైన్‌మన్ మృతి చెందాడు. వివరాలు ఇలా.. ఎడిపల్లి మండల కేంద్రానికి చెందిన బి మహేందర్(34) బోధన్ సబ్‌స్టేషన్ పరిధిలోని బెల్లాల్ ప్రాంతంలో అసిస్టెంట్ లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రాజీవ్‌నగర్ తండాలో చిన్నపాటి విద్యుత్ మరమ్మతులు ఉండటంతో గురువారం అతడు ఎల్‌సీ (లైన్ క్లియర్) తీసుకోకుండా మరమ్మతులు చేపట్టాడు. ఈ క్రమంలో పైనున్న 11 కెవి విద్యుత్ తీగలు తగలడంతో అతడికి తగలడంతో ట్రాన్స్‌ఫార్మర్‌పై పడి, అక్కడి నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. బోధన్ ట్రాన్స్‌కో డీఈ ఎండీ ముక్తార్, అధికారులు ఆస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం స్వగ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.