
మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
లింగంపేట(ఎల్లారెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్లు డిక్యూఎంఏఎస్ (జిల్లా క్వాలిటీ అసెస్‌మెంట్ అధికారి) రాధిక అ న్నారు. గురువారం ఎన్‌ఏక్యూస్ (నేషనల్ క్వా లిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్) సంస్థ బృందం స భ్యులు లింగంపేట మండలం మోతె, పొల్కంపేటలో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రజారోగ్య సేవల నాణ్యతను పెంపొందించడానికి ఏర్పాటు చేసిన సంస్థ అన్నారు. మండలంలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాలలో ఆరోగ్య సేవలను, నాణ్యతను పరిశీలించారు. ఉత్తమ సేవలు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలను వైద్య సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో డీపీవో పద్మజ, దిఖ్యం జహీరా, వైద్యాధికారి రాంబాయి, సీహెచ్‌వో రమేశ్, ఫరిదా, యాదగిరి, గణేష్, రాజేశ్వరీ, ఎలిజబేత్, విజయకుమారి, రజిని, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ ఐక్యత కోసం
కలిసి పనిచేయాలి
రాజంపేట : మండల కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉండరాదని అందరూ పార్టీ కోసం ఐక్యతతో పని చేయాలని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజంపేట గ్రామంలో నెలకొన్న ఇందిరమ్మ ఇళ్ల గందరగోళ విషయంపై ఆయన కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరు డబ్బులు వసూలు చేసినట్లు నిరూపణ జరిగినా వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నాయకత్వంలో పార్టీ కోసం కష్టపడి పని చేయాలని, రాబోయే స్థానిక ఎన్నికలలో సత్తా చాటాలని సూచించారు. మండల పార్టీ అధ్యక్షులు యాదవ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వ్యవసాయశాఖలో
ఘటనపై విచారణకు ఆదేశం
డొంకేశ్వర్(ఆర్మూర్): మరణించిన ఉద్యోగికి సంబంధించిన ఫ్యామిలీ బెనిఫిట్స్ ఇచ్చే విషయంలో ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలపై నిజామాబాద్ రూరల్ వ్య వసాయాఽధికారిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ విచారణకు ఆదేశించింది. విచారణ అధికారులుగా సింగారెడ్డి, శివాజీ పాటిల్‌లను నియమించింది. వీరు హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చి శుక్రవారం బాధిత కుటుంబాన్ని, అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని విచారించనున్నారు. ఇటు టీజీవో ఆధ్వర్యంలో కలెక్టర్, డీఏవోకు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

మెరుగైన వైద్య సేవలే లక్ష్యం