
నగరంలో సైబర్ మోసం
● లింక్ ఓపెన్ చేసి, రూ.1.48లక్షలు పోగొట్టుకున్న రిటైర్డ్ ఉద్యోగి
ఖలీల్‌వాడి: నగరంలోని ఓ రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగి బ్యాంక్ ఖాతాల నుంచి సైబర్ మోసగాళ్లు రూ.1.48 లక్షలు కాజేశారు. నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ గురువారం తెలిపిన వివరాలు ఇలా.. రిటైర్డ్ ఉద్యోగి ఇటీవల ఫోన్‌పే పని చేయకపోవడంతో బ్యాంక్ అధికారులను సంప్రదించారు. దీంతో బ్యాంక్ సిబ్బంది గూగుల్‌పే లేదా ఫోన్‌పే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈక్రమంలో సదరు వ్యక్తి గూగుల్‌లో సెర్చ్ చేసి ఓ ఫోన్ నంబర్‌కు కాల్ చేశాడు. అనంతరం వేరే ఫోన్ నెంబర్ నుంచి సైబర్ మోసగాళ్లు కాల్ చేసి ఓ లింక్ పంపిస్తున్నామని చెప్పి పంపించారు. వెంటనే అతడు లింక్ ఒపెన్ చేయడంతో బాధితుడికి ఉన్న యూనియన్‌బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, పంజాబ్‌నేషనల్ బ్యాంక్‌ల ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.48 లక్షలను కాజేశారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
విద్యుదాఘాతంతో మేక మృతి
నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): మండలంలోని జలాల్‌పూర్ గ్రామశివారులో గురువారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మేక మృత్యువాత పడింది. మండలంలోని జప్తిజాన్కంపల్లి గ్రా మానికి చెందిన చిన్నన్న అంజయ్య రోజూలాగే గు రువారం తన మేకల మందను తీసుకొని మేతకో సం జలాల్‌పూర్ శివారుకు వెళ్లాడు. కాగా ఇటీవల కురిసిన గాలివానకు జలాల్‌పూర్ శివారులో విద్యుత్‌స్తంభం నుంచి విద్యుత్‌వైరు ఊడిపోయి కిందపడింది. కిందపడిన వైరును గమనించక మేకలమంద అటువైపు వెళ్లగా మందలోని ఓ మేక ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడింది. ప్రమాదంలో మృతిచెందిన మేక విలువ సుమా రు రూ.10వేల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. కాగా విద్యుత్‌వైరు నేలపై పడిన వైపు మనుషులెవరూ వెళ్లకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో అధికారులు, పశువైద్య సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగినతీరును తెలుసుకున్నారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
సిరికొండ: మండలంలోని కొండాపూర్ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎమ్మారై గంగరాజం గురువారం పట్టుకొని పంచనామా చేసి పోలీసులకు అప్పగించారని ఎస్సై రామ్ తెలిపారు. కొండాపూర్‌కు చెందిన ట్రాక్టర్ యాజమాని మామిడి నర్సయ్య, డ్రైవర్ రామకృష్ణ, మెట్టుమర్రి తండాకు చెందిన మురళిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

నగరంలో సైబర్ మోసం