
చైన్‌స్నాచింగ్ ముఠా అరెస్టు
ఆర్మూర్‌టౌన్: ఆటోలో ప్రయాణించే మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నట్లు జిల్లా పోలీస్ కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్ గ్రామానికి చెందిన చైన్ స్నాచింగ్ బాధితురాలు బొబ్బిలి లక్ష్మి ఇటీవల ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ బైపాస్ మార్గం వద్ద గురువారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఏడుగురిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన ఏడుగురు నిందితులు కూలీ పనుల పేరుతో నిర్మల్ జిల్లాలోని తిమ్మాపూర్, మంజులపూర్ ప్రాంతాల్లో నివసిస్తూ, మహిళల మెడల నుంచి బంగారు గొలుసులు చైన్ స్నాచింగ్ చేసినట్లు నిర్ధారించారు. కాగా వారి వద్ద నుంచి 12.2 తులాల బంగారు ఆభరణాలు, రెండు బైకులు, ఒక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముఠాను పట్టుకోవడంలో కృషిచేసి పోలీసులకు రివార్డులను అందజేశారు. సమావేశంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ, శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

చైన్‌స్నాచింగ్ ముఠా అరెస్టు