
అకాల వర్షంతో ఇబ్బందులు
నిజాంసాగర్: అకాల వర్షాలకు అన్నదాత ఆగమవుతున్నాడు. పంటలు తడిసిపోతుండడంతో ఆందోళన చెందుతున్నాడు. మంగళవారం రాత్రి జిల్లాలోని పలు ప్రాంతాలలో వర్షం కురిసింది. మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి, నర్వ, మహమ్మద్‌నగర్, గున్కుల్, బూర్గుల్, తుంకిపల్లి, కోమలంచ, గాలీపూర్, ముగ్ధుంపూర్, గిర్ని, కొనతండాల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు తడిసిపోయాయి. కుప్పలచుట్టూ చేరిన నీటిని తొలగించేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు. తడిసిన ధాన్యం బస్తాలను రోడ్డువరకు మోసుకుని వచ్చి ఆరబెట్టారు. త్వరగా తూకాలు పూర్తి చేసి, ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు.

అకాల వర్షంతో ఇబ్బందులు