
ఐ యామ్ ఏ ఫార్మర్
● పెళ్లిపత్రికలో సగర్వంగా
ముద్రించుకున్న యువరైతు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రైతేరాజు అనేది అనాదిగా ఉన్న నానుడి. అయితే రానురాను వ్యవసాయం చేస్తున్న యువకులను పెళ్లిచేసుకునేందుకు మాత్రం అమ్మాయిలు ముందుకు రావడం లేదు. దీంతో వ్యవసాయం చేస్తున్నానని చెప్పుకునేందుకు సైతం యువత ముందుకు రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓ యువకుడు తాను రైతునని గర్వంగా చాటుకుంటున్నాడు. తన వివాహ పత్రికపై ‘ఐ యామ్ ఏ ఫార్మర్’ అని పేరు పక్కన సగర్వంగా పెట్టుకున్నాడు. అదేవిధంగా నాగలి పట్టిన రైతు, ఎద్దుల బొమ్మను ఉండేలా పత్రికను ముద్రించుకున్నాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాతు సంగెం గ్రామానికి చెందిన యువ రైతు జ్ఞానేశ్వర్, సౌందర్య వివాహం ఈ నెల 22వ తేదీన గాంధారిలో జరగనుంది. వివాహ పత్రిక చూసినవారు దీనిపై చర్చింకుంటున్నారు.