
ఆలయానికి విరాళం అందజేత
కామారెడ్డి అర్బన్: పట్టణంలోని పశ్చిమ హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉన్న పోచమ్మ, మైసమ్మ ఆలయం షెడ్డు నిర్మాణానికి మాజీ కౌన్సిలర్లు నిట్టు వేణుగోపాలరావు, కృష్ణమోహన్‌రావు వారి తల్లి దివంగత హైమావతి జ్ఞాపకార్థంగా రూ.లక్షా 50వేల విరాళాన్ని బుధవారం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు చీటి పాండురంగారావు, మంచి రవి, రాజేశ్వర్‌రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
ఆలయానికి గడ్డి వితరణ
భిక్కనూరు: దక్షిణ కాశీగా పేరొందిన భిక్కనూరు సిద్ధరామేశ్వర ఆలయ కోడెలకు కుషాల్‌రెడ్డి కుటుంబీకులు ట్రాక్టర్ గడ్డిని బుధవారం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పునర్‌నిర్మాణ కమిటీ అధ్యక్షుడు అందె మహేందర్‌రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.