
కూతురు పెళ్లైన రెండు రోజులకే..
నందిపేట్(ఆర్మూర్): కూతురి పైళ్లెన రెండు రోజులకే గుండె పోటుతో తండ్రి మరణించిన ఘటన నందిపేటలో చోటు చేసుకుంది. నందిపేట మండల కేంద్రంలో గత 30ఏళ్లుగా సేవలందిస్తున్న పోస్టుమన్ గంగాధర్ (50)కు ముగ్గురు కూతుళ్లు కాగా చిన్న కూతురు పెళ్లిని ఆదివారం రోజు ఘనంగా చేశారు. మంగళవారం కూతురి అత్తగారింటికి టాటావ్యాన్‌లో కుటుంబంతో సహా వెళుతుండగా మార్గమధ్యలో ఒక్కసారిగా గంగాధర్‌కు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా, ఫలితం లేకుండా పోయింది. 30ఏళ్లుగా గ్రామీణ డాక్ సేవక్‌గా ప్రజలకు సేవలందిస్తూ ప్రతి ఒక్కరి హృదయాలలో నిలిచిన పోస్టు గంగాధర్.. కూతురు పెళ్లి జరిగి రెండు రోజులు గడువక ముందే హఠన్మరణం చెందడంతో గ్రామస్తులంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. అంత్యక్రియలలో వేలాది మంది పాల్గొని కంటతడి పెట్టారు.
గుండెపోటుతో
తండ్రి మరణం