
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి
ఆర్మూర్ టౌన్: రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన ఆర్మూర్ మండలం చేపూర్ శివారులోని 63వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణానికి చెందిన కొండూరు నాగార్జున్ (21), నరేంద్ర (19) గత ఆదివారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపురం గ్రామంలోని మేనత్త ఇంట్లో జరిగిన శుభకార్యానికి బైక్‌పై వెళ్లారు. బుధవారం ఉదయం తిరిగి వస్తుండగా చేపూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్‌న్ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో నాగార్జున్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలపాలైన నరేందర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఇరువైపులా నిలిచిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. కటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బైక్‌ను ఢీకొన్న డీసీఎం వాహనం
ఆర్మూర్‌లో విషాదఛాయలు
ఒంటరైన తల్లి..
ఆర్మూర్ పట్టణంలోని జెండాగల్లీలో నివాసముండే కొండూరు పద్మ భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. నాగార్జున్ హైదరాబాద్‌లో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తుండగా తమ్ముడు నరేంద్ర అక్కడే హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్నాడు. వారం క్రితమే ఆర్మూర్‌లోని ఇంటికి వచ్చారు. అన్నదమ్ములిద్దరూ హైదరాబాద్‌కు బయల్దేరాల్సి ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. కొడుకులు ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్నారనుకుంటుండగానే రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలిగొంది. కట్టుకున్న భర్త, ఇద్దరు కుమారులు లోకం వదిలి వెళ్లడంతో తల్లి పద్మ ఒంటరిగా మిగిలింది.

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి