
పెళ్లిలో భోజనం చేస్తూ ఒకరి మృతి
భిక్కనూరు: పెళ్లిలో భోజనం చేస్తూ కుప్పకూలి ఒకరు మృతి చెందిన ఘటన కాచాపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన గరిగంటి నరేశ్(33) స్నేహితులతో కలిసి మద్యం సేవించి కాచాపూర్ గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న వివాహానికి వెళ్లాడు. అక్కడ భోజనం చేస్తూ ఆకస్మికంగా కిందపడిపోయాడు. స్నేహితులు వెంటనే నరేశ్‌ను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.