
ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 76 ఫిర్యాదులు వచ్చాయి. భూ సమస్యలు, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్ల మంజూరు తదితర అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించాలన్నారు. పరిష్కారాలకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై తగిన చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, ఆర్డీవో వీణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అధిక మార్కులు సాధించిన
విద్యార్థులకు సన్మానం..
ఇటీవల విడుదలైన పదోతరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సన్మానించారు. పట్టణానికి చెందిన శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థిని బొడ్డుపల్లి నాగ అక్షయ 586, బి హర్షవర్ధన్ 576, ఎస్ మృణాళిని 572, సిహెచ్ జాహ్నవి 562, బి.అలేఖ్య 562, పి.రుతిక 555, బి.రామ్ చరణ్ 554, ఆర్ నిశాంత్ 554 మార్కులను సాధించారు. వారిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఈవో రాజు, పాఠశాల ప్రిన్సిపాల్ సంపత్ కుమార్, ప్రతినిధులు అన్నపూర్ణ, సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ప్రజావాణికి 76 ఫిర్యాదులు