ఎల్లారెడ్డి మైనారిటీ యూత్‌ సోషల్‌ వెల్ఫేర్‌ సొసైటీ కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఎల్లారెడ్డి మైనారిటీ యూత్‌ సోషల్‌ వెల్ఫేర్‌ సొసైటీ కార్యవర్గం ఎన్నిక

May 13 2025 12:41 AM | Updated on May 13 2025 12:41 AM

ఎల్లారెడ్డి మైనారిటీ యూత్‌ సోషల్‌ వెల్ఫేర్‌ సొసైటీ కార్

ఎల్లారెడ్డి మైనారిటీ యూత్‌ సోషల్‌ వెల్ఫేర్‌ సొసైటీ కార్

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మైనారిటీ యూత్‌ సోషల్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడిగాసయ్యద్‌ నజీబుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మాజీ జెడ్పీటీసీ గయాజుద్దిన్‌ సోమవారం తెలిపారు. ఎల్లారెడ్డిలో నూతనంగా మైనార్టీ యూత్‌ సోషల్‌ వెల్ఫేర్‌ సొసైటీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఉపాధ్యక్షుడిగా షోయబ్‌ మోహినోద్దిన్‌, ఫరూఖ్‌, ప్రధాన కార్యదర్శిగా అబ్రార్‌, కోశాధికారిగా అబ్దుల్‌ రహ్మాన్‌లను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గం ఎల్లారెడ్డి సీఐ రవీందర్‌నాయక్‌, ఎస్సై మహేష్‌లను కలిసినట్లు వారు తెలిపారు.

మహిళను కాపాడిన కానిస్టేబుల్‌

నస్రుల్లాబాద్‌(బాన్సువాడ): మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద సోమవారం ఓ మహిళ తాను చనిపోతానంటూ పరుగెత్తడాన్ని గమనించిన స్థానిక వ్యాపారి పోలీసులకు సమాచారం అందించారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ వెంటనే అప్రమత్తమై నిజాంసాగర్‌ ప్రధాన కాలువ వైపు పరుగెడుతున్న మహిళను పట్టుకొని నచ్చజెప్పి స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు. మహిళ ప్రాణాలను రక్షించిన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ను ఎస్పీ రాజేశ్‌చంద్ర అభినందించారు.

మహిళలే..

పారిశుధ్య కార్మికులు

బాన్సువాడ రూరల్‌: మండలంలోని హన్మాజీపేట్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ వద్ద మురికి నీళ్లు రోడ్డుపై నుంచి పారుతున్నాయి. చిన్నపాటి వర్షానికే మురికి కాలువ పొంగడంతో చెత్తాచెదారం, మురికి నీరు సమీపంలోని ఇళ్ల ముందు చేరింది. శుభ్రం చేయించాల్సిన పంచాయతీ కార్యదర్శి పట్టించుకోకపోవడంతో మహిళలే పారిశుధ్య కార్మికులుగా మారి పరిసరాలు శుభ్రం చేసుకున్నారు. అధికారులు స్పందించి గ్రామంలోని మురికి కాలువలను శుభ్రం చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

బాధిత కుటుంబానికి

అండగా మాజీ ఎమ్మెల్యే

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్స్‌ ఫ్యాక్టరీ పరిధి 44వ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రణీ త కుటుంబానికి అండగా నిలవాలని ఆదిలాబా ద్‌ జిల్లా మాజీ మంత్రి జోగు రామన్న సూచించడంతో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ కుటుంబానికి అండగా నిలిచారు. సంబంధిత ఆస్పత్రి సూపరిండెంట్‌, పోలీస్‌ అధికారులతో మాట్లాడారు. వెంటనే పోస్టుమార్టం జరిపించి బాధిత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందించారు. దీంతో ప్రణీత కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement