
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ఎల్లారెడ్డి/సదాశివనగర్/తాడ్వాయి/రాజంపేట/లింగంపేట/నాగిరెడ్డిపేట : బాధితులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పలు చోట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు సోమవారం పంపిణీ చేశారు. ఎల్లారెడ్డిలోని 8వ వార్డుకు చెందిన పాపిని లింగంకు రూ.10వేల చెక్కు మంజూరు కావడంతో కాంగ్రెస్ నాయకులు అతడి ఇంటికి వెళ్లి చెక్కును అందజేశారు.సదాశివనగర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులకు మంజూరైన రూ. 23లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను 67మందికి అందజేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సంగారెడ్డి తెలిపారు. తాడ్వాయి మండలం సంగోజీవాడి, కాలోజీవాడి, ఎర్రపహాడ్, చిట్యాల గ్రామాలలో బాధితులకు మంజూరైన రూ. 4లక్షల విలువ గల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఇంటింటికి వెళ్లి అందజేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి తెలిపారు. రాజంపేట మండలంలోని పలు గ్రామాలలో 25 మంది బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రణీత్ రెడ్డి, మండల కమిటీ ఆధ్వర్యంలో అందించారు. లింగంపేట మండలం శెట్పల్లి గ్రామానికి చెందిన సువర్ణ సాయవ్వకు రూ. 36వేలు, బొడ్డు పోచయ్యకు రూ. 12,500 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కృష్ణగౌడ్ అందజేశారు. నాగిరెడ్డిపేట మండలం బంజారతండాకు చెందిన బాధితుడు గన్యానాయక్‌కు మంజూరైన రూ. 60 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ఎల్లారెడ్డి ఏఎంసీ డైరెక్టర్ నాగేశ్వర్ అందజేశారు.ఈకార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.