
అడ్మిషన్ల కోసం లెక్చరర్ల పాట్లు
కామారెడ్డి టౌన్ : ఇంటర్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్ర క్రియ నడుస్తోంది. ఈనెల ఒకటో తేదీనుంచి దర ఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్షలలో 11,871 మంది ఉత్తీర్ణులయ్యా రు. వారిని ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించడం కోసం లెక్చరర్లు ఇంటింటికి వెళ్తున్నారు.
ఫలితాల్లో అట్టడుగున..
ఇంటర్ ఫలితాల్లో జిల్లా వెనకబడి ఉంది. ఫస్టియర్ లో 50.09 శాతం, సెకండియర్‌లో 56.38 శాతం ఉ త్తీర్ణత సాధించి, రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో ని లిచింది. సరైన వసతులు లేకపోవడం, లెక్చరర్ల పో స్టులు ఖాళీగా ఉండడంతో సగం మంది వరకు ఫె యిల్ అవుతున్నారు. వరుసగా రెండేళ్లుగా ఫలితా ల్లో చిట్టచివరన ఉండడంతో ప్రభుత్వ కళాశాలలపై నమ్మకం సడలుతోంది. ఇది అడ్మిషన్లపై ప్రభావం చూపుతోంది. లెక్చరర్ల పోస్టులు 244 ఉండగా.. ఇరవైకిపైగా ఖాళీలున్నాయి.
ఆసక్తి చూపని విద్యార్థులు..
జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నా యి. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరంలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ ఒక్కో సెక్షన్‌కు 44 సీట్లున్నాయి. జిల్లాలోని అన్ని కళాశాలల్లో కలిపి ఫస్టియర్‌లో 2,816, సెకండియర్‌లో 2,816 సీట్లున్నాయి. అయితే ఇవి పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు. 2023–24 విద్యాసంవత్సరంలో ఫస్టియర్‌లో 2,103 మంది, సెకండియర్‌లో 2,599 విద్యార్థులుండగా.. 2024–25 విద్యాసంవత్సరంలో ఫస్టియ ర్‌లో 1,993 మంది, సెకండియర్‌లో 2,447 మంది మాత్రమే ఉన్నారు. గతేడాది ఫస్టియర్‌లో 8 వందలకుపైగా సీట్లు ఖాళీగా ఉండడం గమనార్హం.
అడ్మిషన్లు బాగానే వస్తున్నాయి
జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు లెక్చరర్లు కృషి చేస్తున్నారు. ఇప్పటికే లెక్చరర్లు తమ పరిధిలోని గ్రా మాలు, వార్డులకు వెళ్లి సర్వే చేస్తూ, సర్కారు కాలేజీల గురించి ప్రచారం చేస్తు న్నారు. అడ్మిషన్లు బాగానే వస్తున్నాయి.
– షేక్ సలాం, ఇంటర్ నోడల్ అధికారి, కామారెడ్డి
జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. వాటిలో అడ్మిషన్ల కోసం లెక్చరర్లు శ్రమిస్తున్నారు. కళాశాల పరిధిలోని గ్రామాలకు వెళ్లి పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. సర్కారు కళాశాలల్లో వసతుల గురించి వివరిస్తున్నారు. తమ కళాశాలలో చేరాలని కోరుతున్నారు. అయితే చాలా మంది సర్కారు కాలేజీలలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పేద, దిగువ మధ్య తరగతి విద్యార్థులు కొందరు మాత్రమే సర్కారు కళాశాలల వైపు చూస్తున్నారు.

అడ్మిషన్ల కోసం లెక్చరర్ల పాట్లు

అడ్మిషన్ల కోసం లెక్చరర్ల పాట్లు