
సీసీ కెమెరాల ప్రాధాన్యతను గుర్తించాలి
కుస్తీపోటీల్లో తలపడుతున్న మల్లయోధులు
కామారెడ్డి క్రైం: ప్రతిఒక్కరు సీసీ కెమెరాల ప్రాధా న్యతను గుర్తించాలని ఏఎస్పీ చైతన్యరెడ్డి సూచించా రు. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీ డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయంలో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను ఆమె సోమవారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీలో ఉన్న వారందరూ దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ప్రజలే అయినప్పటికీ కలసికట్టుగా ముందుకు వచ్చి రూ. 2 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పా టు చేసుకోవడం అభినందనీయమన్నారు. పోలీసు లకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మిగతా కాలనీల ప్రజలు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకో వాలన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై శ్రీరామ్, సిబ్బంది కమలాకర్‌రెడ్డి, విశ్వ నాథ్, అజర్, సంపత్, నర్సారెడ్డి, కాలనీవాసులు రా జు, ముజాహిద్, షాదుల్ తదితరులు పాల్గొన్నారు.

సీసీ కెమెరాల ప్రాధాన్యతను గుర్తించాలి