
ప్రమాదం కాదు.. హత్యే..
మాక్లూర్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించి భర్తను ప్రియుడితో కలిసి భార్య హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదట దాబా పైనుంచి పడి చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు పూర్తిచేయగా, కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా హత్య విషయం తెలిసింది. కేసు వివరాలను ఆదివారం నార్త్ జోన్ సీఐ శ్రీనివాస్ మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ వెల్లడించారు. మాక్లూర్ మండలం కల్లెడి తండాలో ఈ నెల 5న రాత్రి గూగులోత్ శంకర్ దాబా పైనుంచి పడి మృతి చెందాడని భార్య యమున నమ్మించింది. మరుసటి రోజు అంత్యక్రియలు సైతం పూర్తిచేశారు. ఈ విషయమై మృతుడి కుమారుడు గూగులోత్ రమేష్ తండ్రి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఈనెల 10 మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై రాజశేఖర్ వెంటనే విచారణ ప్రారంభించి యమునను అదుపులోకి తీసుకుని విచారించగా, హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నారు. 5వ తేదీ రాత్రి తన ప్రియుడు నందుతో కలిసి భర్త శంకర్‌ను దాబా పైనుంచి తోసివేసింది. అనంతరం కర్రతో కొట్టి గొంతు నులిమి హత్య చేశారు. దీంతో భార్య, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
భర్తను ప్రియుడితో కలిసి
హతమార్చిన భార్య
దాబా పైనుంచి పడి చనిపోయాడని
నమ్మించిన వైనం
కుమారుడి ఫిర్యాదుతో
విచారణ చేపట్టిన పోలీసులు