
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): అడ్లూర్‌ఎల్లారెడ్డి గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ సమీపంలోగల 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కంఠం గ్రామానికి చెందిన అముల్ నేవీలో విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో సెలవులు రద్దు కావడంతో భార్య బోయర్ ప్రణీత(19)తో కలిసి ఆదివారం సాయంత్రం కారులో విశాఖపట్నం బయలుదేరా డు. అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో వీరి వాహనం అ దుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ప్రణీతకు తీవ్ర గా యాలు కాగా అముల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రణీత మృతి చెందింది. అముల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి