
ఎక్కడి నిల్వలు అక్కడే
పెద్దకొడప్‌గల్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు రైతన్న ఆపసోపాలు పడుతున్నాడు. నూర్పిళ్ల అనంతరం జొన్నలను కొనుగోలు కేంద్రాలకు తరలించగా సమయానికి కాంటా చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మరోవైపు లారీల కొరతతో కాంటా అయిన బస్తాల తరలింపులో జాప్యం ఏర్పడుతుండడంతో అకాల వర్షాలు కురిస్తే ఎక్కడ ధాన్యం తడిసిపోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిలిచిన కాంటాలు..
పెద్దకొడప్‌గల్ మండలంలోని వ్యవసాయ సహకార సంఘంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రానికి ఐదు రోజుల నుంచి లారీలు రాకపోవడంతో కాంటాలు నిలిచాయి. ఇప్పటికే వేల బస్తాలు కాంటా పూర్తయి తరలించడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని తరలించకపోవడంతో రైతులు రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సి వస్తోంది. వర్షం వచ్చినప్పుడల్లా జొన్నలపై టార్పాలిన్లు కప్పుతూ కాపాడుకుంటున్నారు. కాగా ఆయా గ్రామాల రైతులు వడ్ల తరలింపునకు లారీల యజమానులకు ఎక్కువ డబ్బులు ఇస్తుండడంతో వారికే లారీలను కేటాయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి లారీలను తెప్పించి బస్తాలను త్వరగా తరలించాలని రైతులు కోరుతున్నారు.
లారీల కొరతతో ఇబ్బందులు
రైతుల్లో అకాల వర్షాల భయం
రాత్రింబవళ్లు జొన్న కుప్పల వద్దే
పడిగాపులు
పట్టించుకోని అధికారులు
డబ్బులిస్తేనే లారీలు..
జొన్నలు తూకం వేసి పది రోజులవుతోంది. లారీలు రాకపోవడంతో ఇక్కడే ఉ న్నాయి. ఇతర గ్రామాల రై తులు లారీల యజమానుల కు బస్తాకు రూ. 30 నుంచి రూ.40 ల చొప్పున ఇస్తుండడంతో అక్కడికే వెళుతున్నాయి. – బస్సి కిషన్, రైతు, పెద్దకొడప్‌గల్
ఇబ్బందుల్లేకుండా చూస్తాం..
వరి, జొన్నలు ఒకేసారి రావడంతో బస్తాల తరలింపులో ఆలస్యమవుతోంది. వరి కొనుగోళ్లు పూర్త య్యాయి. జొన్నల కొనుగోలు మిగిలింది. బస్తాలు తరలించేందుకు లారీలు వస్తున్నాయి. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. మా సొసైటీ పరిధిలో 58,072 క్వింటాళ్లు కొనుగో లు చేశాం. మరో 25వేల క్వింటాళ్ల జొన్నలు వచ్చే అవకాశం ఉంది.
– సందీప్, కార్యదర్శి, పెద్దకొడప్‌గల్ పీఏసీఎస్
16 రోజులైనా కొనుగోలు చేయలే
కొనుగోలు కేంద్రానికి జొన్నలు తెచ్చి 16 రోజులు దాటినా ఇంత వరకు కొనుగోలు చేయలేదు. రాశుల వద్దే పడిగాపులు కాస్తున్నాం. వర్షం వచ్చినప్పుడల్లా పట్టాలు కప్పలేక ఇబ్బందిపడుతున్నాం.
–గోండ శంకర్, రైతు, పెద్దకొడప్‌గల్

ఎక్కడి నిల్వలు అక్కడే

ఎక్కడి నిల్వలు అక్కడే