జవాన్‌ కుటుంబానికి అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

జవాన్‌ కుటుంబానికి అండగా ఉంటాం

May 12 2025 6:47 AM | Updated on May 15 2025 5:29 PM

మాచారెడ్డి : మావోయిస్టుల మందుపాతర కు బలైన గ్రేహౌండ్స్‌ జవాన్‌ వడ్ల శ్రీధర్‌ కు టుంబానికి అండగా ఉంటామని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నా రు. ఆదివారం పాల్వంచలో శ్రీధర్‌ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ప్రభు త్వం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ఆ యన వెంట బీజేపీ నేతలు తోట బాల్‌రాజు, వెంకటరెడ్డి, అనిల్‌, సురేశ్‌ ఉన్నారు.

గిరిజన గురుకులాల్లో ఇంటర్‌ అడ్మిషన్లు

ఇందల్వాయి : రీజియన్‌ పరిధిలోని మెదక్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలలోని గిరిజ న సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని సంస్థ రీజినల్‌ కోఆర్డినేటర్‌ గంగారాం నాయక్‌ తెలిపారు. మెదక్‌, చేగుంట, నర్సాపూర్‌, కోనాపూర్‌, ఎల్లారెడ్డి, హన్మాజీపేట, ఇందల్వాయి బాలికల జూనియర్‌ కళాశాల లో ఎంపీసీ, బైపీసీ సీట్లు, నర్సాపూర్‌లో సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. 

కౌడిపల్లి, నాగిరెడ్డిపేట, చీమన్‌పల్లి బాలుర జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ సీట్లు, బాన్సువాడలో సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. మొదట గిరిజన సంక్షేమ గురుకులాల్లో చదివిన విద్యార్థులతో సీట్లు భర్తీ చేశామని, మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 15న కామారెడ్డిలో బాలురకు, 16న చేగుంటలో బాలికలకు కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు కౌన్సిలింగ్‌ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

30 కిలోల మీనం

డొంకేశ్వర్‌ : ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌లో ఓ మత్స్యకారుడి వలకు బొచ్చ రకానికి చెందిన 30 కిలోల భారీ చేప చిక్కింది. డొంకేశ్వర్‌ మండలం చిన్నయానం గ్రామానికి చెందిన కొంతమంది మత్స్యకారులు ఆదివారం గోదావరిలో చేపల వేటకు వెళ్లారు. భరత్‌ అనే మత్స్యకారుడికి భారీ చేప చిక్కింది. దీనిని వ్యాపారులకు విక్రయించాడు. ప్రతి వేసవిలో ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ తగ్గి 20 నుంచి 30 కిలోల పైబడిన చేపలు మత్స్యకారులకు చిక్కుతున్నాయి.

జవాన్‌ కుటుంబానికి అండగా ఉంటాం 1
1/1

జవాన్‌ కుటుంబానికి అండగా ఉంటాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement