
నల్లమట్టి లారీ బోల్తా
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలంలోని విజయనగరం గ్రామం వద్ద నల్లమట్టిని తరలిస్తున్న లారీ బోల్తా పడింది. నిర్మల్ జిల్లా పంచగూడ గ్రామ సమీపంలోని గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి ఆర్మూర్ పరిసర ప్రాంతాలకు నల్లమట్టిని తరలిస్తుండగా భారీ లారీ విజయనగరం గ్రామ సమీపంలోని కల్వర్టు వద్ద బోల్తా పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుపై నుంచి లారీతోపాటు నల్లమట్టిని తొలగించడంతో రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.
ఈత చెట్లు దగ్ధం
రుద్రూర్: మండలంలోని రాణంపల్లి శివారులో శనివారం మధ్యాహ్నం ఈత చెట్లు దగ్ధమయ్యాయి. సమీప పొలంలో నుంచి వచ్చిన మంటలతో 40 ఈత చెట్లు కాలిపోయినట్టు బాధితులు తెలిపారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధితులు అధికారులను కోరారు.

నల్లమట్టి లారీ బోల్తా