
పత్రికా స్వేచ్ఛకోసం నిరసన గళం
13న పాలిసెట్
కామారెడ్డి అర్బన్ : జిల్లాకేంద్రంలో మంగళవారం నిర్వహించే పాలిసెట్ కోసం ఏర్పాట్లు చేసినట్లు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్, పరీక్షల సమన్వయకర్త విజయ్‌కుమార్ తెలిపారు. జిల్లాలో 2,900 మంది పరీక్షలు రాయనున్నారని, వారికోసం ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ఉద యం పదిగంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, 11 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆ లస్యం అయినా అనుమతించబోమని పేర్కొన్నారు. హాల్ టికెట్‌పై అభ్యర్థి ఫొటో స్పష్టంగా లేకపోతే గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ చేయించుకుని రావాలని సూచించారు.
పీజీ ఫలితాల వెల్లడి
బాన్సువాడ రూరల్ : ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ, పీజీ (అటానమస్) కళాశాలలో శనివారం పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాలను తెలంగాణ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంపత్‌కుమార్ విడుదల చేశారు. ఎంఏ ఇంగ్లిష్ మొదటి సెమిస్టర్‌లో 100 శాతం ఉత్తీర్ణత నమోదయ్యిందని, ఎంఏ తెలుగులో 93 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. విద్యార్థులతో పాటు అధ్యాపకులను అభినందించారు. ఈసందర్భంగా ప్రిన్సిపల్ వేణుగోపాల స్వామి మాట్లాడుతూ తెలంగాణ కామన్ పీజీ ఎంట్రె న్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల అయ్యిందన్నారు. మే 19లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెయూ అడిషనల్ కంట్రోలర్ సంపత్, కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ షేక్ అక్బర్ బాషా, అడిషనల్ కంట్రోలర్ అంబయ్య తదితరులు పాల్గొన్నారు.
తుజాల్‌పూర్‌లో రాస్తారోకో చేస్తున్న రైతులు
తాగునీటి కోసం బోరుబావి వద్ద వేచి ఉన్న రతన్ సింగ్ తండావాసులు
బాన్సువాడ రూరల్: పత్రికా స్వేచ్ఛను కాపాడాలంటూ బాన్సువాడ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై ఆంధ్రా పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ శనివారం బాన్సువాడ అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు. సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడడాన్ని మానుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్‌గౌడ్, చంద్రశేఖర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు సయ్యద్ లతీఫ్, జిల్లా నాయకులు రాజు, పంతులు నరేష్, జర్నలిస్టులు శ్రీకాంత్‌రెడ్డి, వరప్రసాద్, జకీర్, రామాగౌడ్, శ్రీనివాస్, సుందర్, సలీం, సతీష్‌గౌడ్, సుధాకర్, నబీ తదితరులు పాల్గొన్నారు.
బీబీపేట: అకాల వర్షాలతో ఇప్పటికే నష్టపోతున్నామని, వడ్లను వెంటవెంటనే కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ తుజాల్‌పూర్ రైతులు శనివారం రోస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లారీలు రావడం ఆలస్యం కావడం వల్ల కాంటా అయిన వడ్లు పేరుకుపోతున్నాయని, వర్షాలతో తడిసిపోతున్నాయని పేర్కొన్నారు. తడిసిన వడ్లను మిల్లులకు తరలిస్తే అదనపు తరుగు తీస్తున్నారని ఆరోపించారు. అధికారులు, సొసైటీ చైర్మన్ స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు రైతులను సముదాయించారు. సమస్య పరిష్కరిస్తామని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
పెద్దకొడప్‌గల్: తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని రతన్‌సింగ్ తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు లీకేజీలతో మురికి నీరు సరఫరా అవుతుండడంతో ఆ నీరు తాగలేకపోతున్నారు. దీంతో బోరుబావుల వద్దకు వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. అయితే శనివారం తండాలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. తండావాసులు మండుటెండలో తాగునీటి కోసం గంటల తరబడి బోరుబావి వద్ద వేచి చూడాల్సి వచ్చింది. అధికారులు స్పందించి తాగునీటి గోస తీర్చాలని కోరుతున్నారు.

పత్రికా స్వేచ్ఛకోసం నిరసన గళం

పత్రికా స్వేచ్ఛకోసం నిరసన గళం

పత్రికా స్వేచ్ఛకోసం నిరసన గళం