
దైవం మాతృ రూపేణ..
బిడ్డలకు కిడ్నీలు ఇచ్చి పునర్జన్మను ప్రసాదించిన తల్లులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నవమాసాలు మోసి బిడ్డల్ని కన్న తల్లులు.. వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే భరిస్తారు. బిడ్డలు ఎదిగే క్రమంలో ఏదైనా ఆపద వస్తే తన ప్రాణాన్ని అడ్డు పెట్టయినా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. అవసరమైతే తన ఆయుష్షు తీసుకునైనా బిడ్డను కాపాడు తండ్రీ అంటూ తను నమ్ముకున్న దేవుళ్లను వేడుకుంటారు. తల్లి ప్రేమ అలాంటిది మరి.. జిల్లాలో పలువురు తల్లులు తమ బిడ్డల ప్రాణాలను కాపాడడానికి తమ కిడ్నీలను ఇచ్చారు. జిల్లాలో దాదాపు ఇరవై మంది తల్లులు తమ బిడ్డలకు కిడ్నీలు ఇచ్చి పునర్జన్మ ప్రసాదించినట్లు తెలుస్తోంది.
కామారెడ్డి పట్టణానికి చెందిన శంకర్ అనే యువకుడికి కిడ్నీలు దెబ్బతిని మంచం పట్టాడు. ఆస్పత్రులకు తీసుకువెళ్లి వైద్యం చేయించగా.. కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. దీంతో కొడుకుకు తాను కిడ్నీ ఇస్తానంటూ తల్లి పద్మ ముందుకు వచ్చింది. 2022 మార్చి 24న కిడ్నీ మార్పిడి జరిగింది. తల్లీకొడుకులు ఆరోగ్యంగా ఉన్నారు. శంకర్ తన పని తాను చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అమ్మ తనకు పునర్జన్మనిచ్చిందని శంకర్ పేర్కొంటున్నాడు.
కొడుకుకోసం కిడ్నీ ఇచ్చి..