
40 ఫీట్ల రోడ్డు కబ్జాకు యత్నం
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో సుభాష్ థియేటర్ ఎదురుగా ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రకారం 40 ఫీట్ల రోడ్డును ఓ వ్యక్తి కబ్జాకు యత్నిస్తున్నాడు. గతంలో ఈ రోడ్డులో భవన నిర్మాణ పనులు ప్రారంభించగా అప్పటి టీపీవో నోటీసులు జారీ చేసి కూల్చివేయించారు. ఈ రోడ్డు స్థలం తనదేనంటూ హద్దురాళ్లు వేసి సదరు వ్యక్తి మళ్లీ కబ్జాకు యత్నిస్తున్నాడు. దీంతో స్థానిక కాలనీవాసులు ఈ రోడ్డుగుండా వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. టీపీవో గిరిధర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజులుగా రోడ్డుకు అడ్డంగా రాళ్లు అలానే ఉన్నాయి. ఈ విషయమై సాక్షి టీపీవోను వివరణ కోరగా సదరు వ్యక్తికి రెండు సార్లు నోటీసులు జారీ చేశామని, క్రిమినల్ చేసు నమోదు చేయిస్తామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై తుది విచారణ
నాగిరెడ్డిపేట : మండలంలోని వదల్‌పర్తిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎంపికచేసిన లబ్ధిదారుల జాబితాపై శుక్రవారం అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎల్‌పీవో సురేందర్, ఎంపీడీవో ప్రభాకరచారి, ఎస్సై మల్లారెడ్డి సమక్షంలో జీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి ఇళ్లకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను వివరించారు. 17మంది లబ్ధిదారుల జాబితాను పరిశీలించి, ఏడింటిని రిజెక్ట్‌చేసి 10మందిని ఎంపిక చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఏఈ పిచ్చయ్య, జీపీకార్యదర్శి అజీమోద్దీన్ తదితరులున్నారు.
ఆసక్తి, అర్హత ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు
బాన్సువాడ రూరల్ : ఆసక్తి ఉండి, అర్హతలు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని బాన్సువాడ ఎంపీడీవో ముజాహిద్ సూచించారు. శుక్రవారం ఆయన బా న్సువాడ మండలం బోర్లంక్యాంపులో ఇందిరమ్మ లబ్ధ్దిదారుల ఎంపిక కోసం సర్వే చే పట్టారు. జీపీ కార్యదర్శి పరిపూర్ణ, కారోబార్ వినయ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సంజీవ్‌రెడ్డి, షబ్బీర్, పీర్యానాయక్, సంత్యాలి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన
బిచ్కుంద(జుక్కల్) : మండలంలోని గుండెకల్లూర్‌లో ఎంపీడీవో గోపాల్ ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. లబ్ధ్దిదారులు ముందుకు రావాలని కోరారు. గుండెకల్లూర్ గ్రామానికి 111 ఇళ్లు మంజూరు అయ్యాయని, 17 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి తెలిపారు. ఇళ్లు కట్టుకుంటున్న లబ్ధిదారులకు ఇసుక సమస్య లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

40 ఫీట్ల రోడ్డు కబ్జాకు యత్నం