ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. సిద్దిపేట్ జిల్లా సూర్యపేట గ్రామానికి చెందిన బండి బిక్షపతి(65) కొన్ని సంవత్సరాలుగా అంకాపూర్‌లో కూలీ పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడు. కాగ రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం కూలీ పనికి వెళుతున్నాంటూ ఇంట్లో నుంచి వెళ్లాడు. కాగ వ్యవసాయ క్షేత్రంలోనే భిక్షపతి చెట్టుకు ఉరి వేసుకొని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
పిట్లం మండలంలో..
పిట్లం(జుక్కల్): మద్యానికి బానిసై తాగిన మైకంలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాంపూర్ గ్రామంలో చొటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. రాంపూర్ గ్రామానికి చెందిన కమ్మరి రాజు (33) గత కొంతకాలం నుంచి మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి తాగిన మైకంలో ఇంట్లో దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సరోజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
బాన్సువాడ రూరల్: మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. బాన్సువాడ పట్టణానికి చెందిన గూడ సంతోష్ కుమార్(45) గురువారం రాత్రి బైక్‌పై బయలుదేరాడు. బాన్సువాడ–బీర్కూర్ రహదారిపై కొల్లూర్ రైస్‌మిల్ సమీపంలో అతడికి మరో బైక్ ఎదురుగా రావడంతో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో సంతోష్‌కు తీవ్రగాయాలు కావడంతో ఘటన స్థలంలోనే మృతి చెందాడు. బాన్సువాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి అదృశ్యం
ఎల్లారెడ్డిరూరల్: మండల కేంద్రానికి చెందిన షేక్ సలీం(28) అనే యువకుడు అదృశ్యమైనట్లు ఏఎస్సై సిద్ధిఖీ శుక్రవారం తెలిపారు. ఈనెల 4న ఇంటి నుంచి వెళ్లిన సలీం ఇంతవరకు తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య