
సాక్షిపై కక్ష సాధింపు సరికాదు
ఎల్లారెడ్డి: సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదని జర్నలిస్టులు పేర్కొన్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై ఏపీ పోలీసుల దాడిని శుక్రవారం ఎల్లారెడ్డి జర్నలిస్టులు ఖండించారు. నిజాలను బయట పెడుతున్న సాక్షి పత్రికపై తెలుగుదేశం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. అనంతరం ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో ఇన్‌చార్జి ఏవో చంద్రశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎన్‌యూజే జాతీయ ఉపాధ్యక్షులు రాజేందర్‌నాథ్, జర్నలిస్టులు రామప్ప, మహేష్, సిద్దు, యశ్వంత్ పవార్, సంగ్రాం, నాగేశ్వర్‌రావు, శ్రీనివాస్, రాజ్‌కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
నిరసన గళమెత్తిన జర్నలిస్టులు
నిజామాబాద్‌అర్బన్: సెర్చ్ వారెంట్ లేకుండా ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించడం సరైంది కాదంటూ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనంజయరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లాలోని అన్ని జర్నలిస్టు సంఘాల నాయకులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపాయి. సుమారు రెండు గంటలపాటు జర్నలిస్టులు ఈ నిరసనలో పాల్గొన్నారు. మీడియాపై ఆంక్షలు విధించడం, అక్రమ కేసులు నమోదు చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. అనంతరం కలెక్టరేట్ ప్రవేశ మార్గం నుంచి నిరసన ప్రదర్శనగా వెళ్లి అదనపు కలెక్టర్ అంకిత్‌కు వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర నాయకుడు జమాల్‌పూర్ గణేశ్, ఐజేయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొబ్బిలి నర్సయ్య, జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు రామకృష్ణ, ప్రమోద్‌గౌడ్, రవికుమార్, మోహన్, ధనుంజయ్, రామ్‌చందర్, సదానంద్, పంచరెడ్డి శ్రీకాంత్, దేవల్ రవిబాబు, ఇంగు శ్రీనివాస్, ఉమామహేశ్వర్, కొక్క రవి, ఆంజనేయులు, జాన్సన్, సురేశ్, సాక్షి బ్యూరో ఇన్‌చార్జి భద్రారెడ్డి, ఎడిషన్ ఇన్‌చార్జి ప్రభాకర్, సాక్షి టీవీ వీడియో జర్నలిస్ట్ సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సాక్షిపై కక్ష సాధింపు సరికాదు