
రూ. 2.10 కోట్ల రుణాలు రికవరీ
లింగంపేట: శెట్పల్లిసంగారెడ్డి సొసైటీ పరిధిలో రైతులకు ఇచ్చిన దీర్ఘకాలిక రుణాలు రూ. 2.10 కోట్లు రికవరీ చేసినట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మేనేజర్ లింబాద్రి తెలిపారు. శుక్రవారం ఆయన శెట్పల్లిసంగారెడ్డి సొసైటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ నుంచి రైతులకు రూ. 6.70 కోట్ల దీర్ఘకాలిక రుణాలు ఇవ్వగా అందులో 2024–25 సంవత్సరానికి రూ. 2.10 కోట్లు వసూలయ్యాయన్నారు. మండలంలోని లింగంపేట, నల్లమడుగు సొసైటీల కంటే ఎక్కువగా రుణాలు రికవరీ అయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ సీఈవో శ్రీనివాస్‌ను సన్మానించారు. కార్యక్రమంలో లింగంపేట సహకార బ్యాంకు మేనేజర్ కుమార్‌స్వామి, అధికారులు పాల్గొన్నారు.
మూడు రోజుల్లో
130 సెల్‌ఫోన్‌ల రికవరీ
కామారెడ్డి క్రైం: జిల్లాలో సెల్‌ఫోన్ పోయిందనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండడంతో సీఐ స్థాయి అధికారి ఇన్‌చార్జిగా ఆర్‌ఎస్సై, 10 మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి 3 రోజుల్లోనే 130 ఫోన్‌లను రికవరీ చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. రికవరీ చేసిన సెల్‌ఫోన్లను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సెల్‌ఫోన్‌లు పోగొట్టుకున్న వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. లేకపోతే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలిగే అవకాశాలు ఉంటాయన్నారు. వెంటనే సిమ్ కార్డును బ్లాక్ చేసి కొత్త సిమ్ కార్డు తీసుకోవాలని సూచించారు. ఇలా చేస్తే పోయిన సెల్‌ఫోన్‌లను సీఈఐఆర్ విధానంలో రికవరీ చేసేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. రికవరీ చేసిన ఫోన్‌ల వివరాలను బాధితులకు తెలియజేశామన్నారు. సమాచారం లేని వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్‌ఎస్సై బాల్‌రాజు (8712686114) ను సంప్రదించాలని సూచించారు.
బాన్సువాడ డీఎస్పీగా విఠల్‌రెడ్డి
బాన్సువాడ : బాన్సువాడ డీఎస్పీగా విఠల్‌రె డ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. బాన్సువాడలో డీఎస్పీగా పనిచేసిన సత్యనారాయ ణ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో న ల్గొండ పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో వైస్ ప్రి న్సిపల్‌గా పనిచేసిన విఠల్‌రెడ్డి వచ్చారు. శు క్రవారం సత్యనారాయణ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాన్సువాడ టౌన్, రూరల్, బిచ్కుంద సీఐలు, డివిజన్ లోని ఎస్సైలు నూతన డీఎస్పీని కలిశారు.
ఉద్యాన పంటలకు ప్రోత్సాహం
కామారెడ్డి అర్బన్: జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల ద్వారా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడానికి కార్యాచరణ రూపొందించామని జిల్లా ఉద్యాన అ ధికారి జ్యోతి తెలిపారు. పండ్ల తోటల పెంపకంతోపాటు మల్చింగ్, నీటి కుంటలు, ఉ ద్యాన యాంత్రీకరణ, సూక్ష్మసేద్యం, గట్లపై వెదురు సాగు, 2,500 ఎకరాల్లో ఆయిల్ తో టల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 2 వేల ఎకరాలకు సబ్సిడీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. పూర్తి వివరాలకోసం కామారెడ్డి, బీబీపేట, దోమకొండ, రాజంపేట, మాచారెడ్డి, పా ల్వంచ, భిక్కనూరు మండలాల రైతులు 89777 14030లో సంప్రదించాలన్నారు. ఎ ల్లారెడ్డి, లింగంపేట, తాడ్వాయి, గాంధారి, రామారెడ్డి, సదాశివనగర్, నాగిరెడ్డిపేట మండలాల రైతులు 89777 14022 నంబర్ లో, జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్‌గల్, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల రైతులు 89777 14029 నంబర్‌లో సంప్రదించాలని శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు.

రూ. 2.10 కోట్ల రుణాలు రికవరీ

రూ. 2.10 కోట్ల రుణాలు రికవరీ