
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి టౌన్ : విద్యుత్ సిబ్బంది విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో విద్యుత్ భద్రత వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యో గులు భద్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పటి విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన ప్రాథమిక చికిత్సలు, సీపీఆర్ గురించి వైద్యుడు రమేష్ బాబు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాబృందం నాటకం ద్వారా వ్యవసాయదారులకు విద్యుత్ సంబంధిత ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించింది. కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ (టెక్నికల్, భద్రత అధికారి) ప్రభాకర్, డీఈ(ఆపరేషన్) కల్యాణ చక్రవర్తి, డీఈ(ఎంఆర్‌టీ) నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ భద్రత వారోత్సవాల్లో
కలెక్టర్ సంగ్వాన్