విద్యార్థులకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు సన్మానం

May 6 2025 12:51 AM | Updated on May 6 2025 12:51 AM

విద్య

విద్యార్థులకు సన్మానం

కామారెడ్డి క్రైం : బీసీ సంక్షేమ గురుకుల పా ఠశాలల్లో చదివి పదో తరగతి, ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థు లను కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సోమవారం త న చాంబర్‌లో సన్మానించారు. విద్యార్థులు బామన్‌ రమేష్‌, పైడి మౌర్యానంద్‌ రెడ్డి, శ్రీ చైతన్య, మంజ్యా శివ, గాదె అనిరుధ్‌, రక్షితలను అభినందించారు. భవిష్యత్తులో మరి న్ని విజయాలు సాధించి ఉన్నత స్ధానాలకు చేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆ యా గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యా యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

‘కొనుగోళ్లను

వేగవంతం చేయాలి’

రామారెడ్డి: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఐకేపీ డీపీఎం రమేష్‌బాబు సూ చించారు. రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి, మోషంపూర్‌లలో ఏర్పాటు చేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. రామారెడ్డిలో స్ట్రిచ్చింగ్‌ సెంటర్‌ ను పరిశీలించారు. నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఎం ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

‘రైతులు అధైర్యపడొద్దు’

బీబీపేట: అకాల వర్షాలతో తడిసిపోయిన ప్రతి గింజను సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడొద్దని డీఆర్‌డీవో సురేందర్‌ పేర్కొన్నారు. సోమవారం ఉప్పర్‌పల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ డీపీఎం రమేష్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్లను కొనుగోలు చేసిన వెంటనే త్వరగా ట్యాబ్‌ ఎంట్రీ చేయాలన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున వడ్లపై కవర్లను కప్పి ఉంచుకోవాలని రైతులకు సూచించారు. ఆయన వెంట ఏపీఎం బాలపోచయ్య, సీసీలు బాల్‌చంద్రం, నవీన్‌, శ్రీనివాస్‌, రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు.

‘దోస్త్‌’ కోసం

హెల్ప్‌లైన్‌ సెంటర్‌

కామారెడ్డి అర్బన్‌: దోస్త్‌ (డిగ్రీ అన్‌లైన్‌ సర్వీసెస్‌, తెలంగాణ) రిజిస్ట్రేషన్‌లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దోస్త్‌కు తాను జిల్లా హెల్ప్‌లైన్‌ సెంటర్‌ చైర్మన్‌గా, అధ్యాపకుడు విశ్వప్రసాద్‌ సమన్వయకర్తగా, అనిల్‌కృష్ణ, అజారుద్దీన్‌ సహాయకులుగా ఉంటారని పేర్కొన్నారు. దోస్త్‌లో ఆధార్‌, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర రాష్ట్రాల విద్యార్థుల మార్కుల జాబితా, మొబైల్‌ నంబర్లు తదితర అంశాలపై తలెత్తే సమస్యలను గ్రీన్‌ చానల్‌ ద్వారా వెంటవెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.

ఆర్ట్స్‌ కళాశాలను ఎంపిక చేసుకోండి

విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం కోసం కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కళాశాల ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌ కోరారు. తమ కళాశాలలో రాష్ట్రంలో ఎక్కడా లేని ప్రత్యేక కోర్సులున్నాయన్నారు. ఇక్కడ చదివినవారు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, గ్రూప్‌ వన్‌ అధికారులు గా, ప్రొఫెసర్లుగా, అధ్యాపకులుగా, ఆర్మీ, పోలీస్‌, సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్‌ రంగాలలో మంచి స్థానాలలో ఉన్నారని పేర్కొన్నారు. కళాశాలలో చేరాలని విద్యార్థులను కోరారు.

15 లోగా దరఖాస్తు చేసుకోవాలి

నిజామాబాద్‌ అర్బన్‌: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌, డిప్లొమా ఇన్‌ ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ప్రవేశ పరీక్ష కోసం ఈనెల 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నిజామాబాద్‌ డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. వచ్చేనెల 25న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

విద్యార్థులకు సన్మానం 
1
1/2

విద్యార్థులకు సన్మానం

విద్యార్థులకు సన్మానం 
2
2/2

విద్యార్థులకు సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement