
మాతాశిశు సంరక్షణ కార్డుల కొరత
బిచ్కుంద : మహిళలు గర్భందాల్చినప్పటి నుంచి బిడ్డకు ఐదేళ్లు వచ్చేవరకు ఇచ్చే టీకాలు, ఎదురైన ఆరోగ్య సమస్యలు, వైద్య పరీక్షల వివరాలను న మోదు చేయడం కోసం ప్రభుత్వం మాతాశిశు సంరక్షణ సమాచార కార్డులను అందిస్తుంది. కానీ జిల్లా లో ఏడు నెలలుగా ఈ కార్డుల సరఫరా లేదు. దీంతో గర్భిణులు, వైద్యులు ఇబ్బందులు పడుతున్నా రు. ఏడు నెలలుగా కార్డులు లేకపోవడంతో గర్భిణులకు అందించిన వైద్య సేవల వివరాలు తెలుసుకోలేకపోతున్నారు.
కార్డులు ఎందుకంటే..
మాతాశిశు సంరక్షణ కార్డులతో గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. మహిళలు ముందుగా అంగన్‌వాడీ టీచర్, ఏఎన్‌ఎం వద్దకు వెళ్లి గర్భందాల్సిన తేదీ, నెల నమోదు చేసుకోవాలి. వారు వివరాలు నమోదు చేసుకున్న వెంటనే మాతా శిశు సంరక్షణ కార్డు అందిస్తారు. అందులో గర్భిణి పేరు, ఆధార్ కార్డు, ప్రతి నెల వై ద్య పరీక్షలు చేసిన వివరాలు, హిమోగ్లోబిన్ శాతం, బీపీ, మూత్ర పరీక్షలు, బరువు, ఎత్తు, అంగన్‌వాడీ ద్వారా తీసుకుంటున్న పౌష్టికాహారం, బిడ్డ ఎదుగుదల చెప్పే స్కానింగ్ రిపోర్టుల వివరాలు నమోదు చేస్తారు. అలాగే జన్మించిన బిడ్డకు 5 ఏళ్ల వయస్సు వరకు ఇవ్వాల్సిన టీకాలతోపాటు ఇతర వివరాలుంటాయి. గర్భిణులకు ఈ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి. ఇన్ని ఉపయోగా లు ఉన్న కార్డులను అందించడంలో అధికారులు అ లసత్వం వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొంద రు గర్భిణులు కార్డు జిరాక్స్‌లు తీసుకొని వివరాలు నమోదు చేయించుకుంటున్నారు. మాతా శిశు సంరక్షణ బుక్‌లెట్ కార్డు జిరాక్స్ కోసం 150 రూపాయ లు తీసుకుంటున్నారని పలువురు తెలిపారు. ప్రస్తు తం జిల్లాలో 14,800 మంది గర్భిణులు ఉన్నారు. మాతాశిశు సంరక్షణ కార్డులు లేవన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని పీహెచ్‌సీల వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం కార్డులను పంపించగానే పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లకు పంపిస్తామంటున్నారు. జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారులు స్పందించి కార్డులు తెప్పించి గర్భిణులకు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
7 నెలలుగా నిలిచిన సరఫరా
ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, వైద్యులు