కార్మికుల బతుకుల్లో కానరాని కాంతులు | - | Sakshi
Sakshi News home page

కార్మికుల బతుకుల్లో కానరాని కాంతులు

May 1 2025 12:28 AM | Updated on May 1 2025 12:28 AM

కార్మికుల బతుకుల్లో కానరాని కాంతులు

కార్మికుల బతుకుల్లో కానరాని కాంతులు

ఆర్మూర్‌: కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ శాఖను ఏర్పాటు చేసినా వారి బతుకులు మారడం లేదు. కార్మికుల పక్షాన పోరాటాలు చేయడానికి అనేక యూనియన్‌లు పుట్టుకొచ్చినా, ఉద్యమాలు చేసినా వారి జీవితాల్లో కాంతులు నిండటం లేదు. కనీసం ఉద్యమంలో పాల్గొని సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలోనైనా తమ బతుకులు మారేనా అని కార్మికులు పదకొండేళ్లుగా ఆశ గా ఎదురు చూస్తూనే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. మే 1న ప్రపంచ వ్యాప్తంగా కార్మిక దినోత్సవా న్ని ఘనంగా జరుపుకుంటున్నా కార్మికుల బతుకులు చీకటిలో మగ్గిపోతున్నాయనేది అక్షర సత్యం.

జీపీ కార్మికుల వెట్టి చాకిరీ..

జిల్లాలో పారిశుధ్య కార్మికులు వెట్టి చాకిరీ చేస్తున్నా రు. అనేక మంది కార్మికులకు చాలీచాలని జీతాలతో పొట్ట గడవడం కష్టంగా ఉంది. పంచాయతీల ఆదాయం, పన్నుల వసూళ్లతో సంబంధం లేకుండా వేతనాలను చెల్లించాలని కార్మికులు ఉద్యమాలు చే సిన ఫలితంగా ఇటీవల వేతనాలను రాష్ట్ర ప్రభు త్వం చెల్లిస్తోంది. కానీ మూడు, నా లుగు నెలల వేతనం పెండింగ్‌లో ఉంచి వేతనాల చెల్లింపు చేయడంతో కార్మికులు ఇక్కట్లు పడుతున్నారు.

బీడీ కార్మికులకు చేతి నిండా పని కరువు..

జిల్లాలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది బీడీ పరిశ్రమను నమ్ముకొని జీవిస్తున్నారు. పీఎఫ్‌ ఉన్న బీడీ కార్మికులకు వెయ్యి బీడీలు చుడితే రూ. 250 కూలీ, పీఎఫ్‌ లేని వారికి రూ.270 లభిస్తున్నా యాజమాన్యాలు అనుసరిస్తున్న తీరుతో చేతి నిండా పని లేకుండా పోయింది. బీడీలు చుట్టేందుకు కార్మికులు ముందుకు వచ్చినా వర్దీ బీడీల వల్ల వె య్యి బీడీలకు సంగం కూలీ తీసుకోవాల్సి వస్తోంది. మరోవైపు పారిశుధ్య కార్మికులు, బీ డీ కార్మికుల వేతనాలకంటే ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల పరిస్థితి బాగుంది. కూలీలకు పని సమయం తక్కువగా ఉన్నా, రోజు కూలీ లభిస్తుండడంతో పనులు భేషుగ్గా ఉన్నాయని పలువురు అ భిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించి కార్మికులకు సరైన ఉపాధి, సకాలంలో వేతనాలు అందించాలని పలువురు కోరుతున్నారు.

యూనియన్‌లు ఉన్నా.. పోరాటాలు చేసినా మారని జీవితాలు

నేడు కార్మికుల దినోత్సవం ‘మేడే’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement