అవగాహనతోనే ఆటిజం దూరం | - | Sakshi
Sakshi News home page

అవగాహనతోనే ఆటిజం దూరం

Apr 2 2025 1:25 AM | Updated on Apr 2 2025 1:25 AM

అవగాహ

అవగాహనతోనే ఆటిజం దూరం

నిజామాబాద్‌నాగారం: కొంతమంది ఏ సమస్య వచ్చినా వెంటనే గూగుల్‌ శోధించి ఉన్నవీ లేనివి తమకు ఆపాదించుకుంటారు. అనవసరమైన భయాందోళనలకు గురవుతుంటారు. తమ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆటిజం సమస్య ఉన్న పిల్లల విషయంలో సైతం తల్లిదండ్రులు ఇలాంటి తప్పులు చేసే అవకాశం ఉంది. నేడు ‘ప్రపంచ ఆటిజం దినోత్సవం’ సందర్భంగా పిల్లలకు ఆటిజం ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.. పేరు పెట్టి పిలిచినా పలకకపోవడం, ఐ కాంటాక్ట్‌ సరిగా లేకపోవడం, వారి వంక చూసి నవ్వినప్పుడు తిరిగి నవ్వకపోవడం.. వంటి లక్షణాలు ఆటిజం సమస్య ఉన్న పిల్లల్లో కనిపిస్తుంటాయి. జన్యుపరమైన, ఇతరత్రా వివిధ కారణాల వల్ల మన దేశంలో ప్రతి వంద మంది చిన్నారుల్లో ఇద్దరు ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

వాటిని నమ్మడం ఆపేయండి

ఇంటర్నెట్‌ వ్యాప్తి పెరిగిన తర్వాత ఏ సమస్య వచ్చినా గూగుల్‌ చేస్తున్నారు. అందులో చెప్పిన విషయాలను ఆచరించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే కొన్ని రకాల సమస్యల విషయంలో ఇది సరైన మార్గం కాదంటున్నారు నిపుణులు. ఇంటర్నెట్లో ఎంతో సమాచారం ఉంటుంది. ఇందులో సంబంధం లేని సమాచారం కూడా ఉంటుంది. దీనివల్ల మరికొన్ని అనుమానాలు పుట్టుకొస్తుంటాయి. ఇది పిల్లల ఆరోగ్యంపై పడే అవకాశమూ ఉంటుంది. కాబట్టి, ఇంటర్నెట్లో ఉండే సమాచారాన్ని నమ్మకుండా మీకు అనుమానం వచ్చిన వెంటనే సంబంధిత నిపుణుల అభిప్రాయం తీసుకోవడం ఉత్తమం.

సొంత చికిత్స వద్దు..

ఈ రోజుల్లో ఏదైనా తెలియకపోతే యూట్యూబ్‌ చూసి నేర్చుకోవడం సాధారణంగా మారిపోయింది. కొంతమంది తల్లిదండ్రులు ఆటిజం సమస్య గురించి యూట్యూబ్‌లో వెతికి ఇంట్లోనే వారికి శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఆటిజం లక్షణాలు అందరిలో ఒకేరకంగా ఉండకపోవచ్చు. దీనికి స్పష్టమైన చికిత్స అంటూ ఏదీ లేదు. లక్షణాలను బట్టి ఆక్యుపేషనల్‌ థెరపీ, స్పీచ్‌ థెరపీ, బిహేవియరల్‌ థెరపీ.. వంటివి ఇస్తుంటారు. కాబట్టి, సంబంధిత నిపుణులను సంప్రదించి వారు చెప్పే జాగ్రత్తలు పాటించడం మంచిది.

బలవంతం చేయొద్దు

ఆటిజం ఉన్నవారిలో కొంతమంది తమ కంటే తక్కువ వయసున్న పిల్లల్లాగా ప్రవర్తిస్తుంటారు. అయితే తల్లిదండ్రులు మాత్రం పిల్లలు ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయకపోతే కంగారుపడుతుంటారు. కొంతమంది బలవంతం కూడా చేస్తుంటారు. ఉదాహరణకు ఓ ఏడేళ్ల అమ్మాయి ఇంకా నర్సరీ రైమ్స్‌ చూస్తుంటే కొంతమంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటారు. ఇవి వారి కంటే చిన్న పిల్లలు చూడాల్సినవని.. వారి వయసులో చూడాల్సిన ప్రోగ్రామ్స్‌ను బలవంతంగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. దీనివల్ల వారు వాటిని చూడకపోగా మరింత కుంగుబాటుకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, వారికి నచ్చని విషయాల్లో బలవంతం చేయకపోవడమే మంచిది.

బాల్యంలో వేధిస్తున్న

మందబుద్ధి సమస్య

ప్రతి వంద మంది పిల్లల్లో

ఇద్దరికి వచ్చే అవకాశం

నేడు ప్రపంచ ఆటిజం

అవగాహన దినోత్సవం

అవగాహన.. మద్దతు అవసరం

ఆటిజం ఉన్న పిల్లలకు సమాజం, ఉపాధ్యాయులు, వైద్య నిపుణులు కలిసికట్టుగా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు సమయానికి వైద్య సలహా తీసుకోవడం, సమగ్ర విద్య విధానాలను అమలు చేస్తే బాగుంటుంది.

– ప్రొఫెసర్‌ విశాల్‌, న్యూరోసైకియాట్రిస్ట్‌

అవగాహనతోనే ఆటిజం దూరం1
1/1

అవగాహనతోనే ఆటిజం దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement