లెండి వాగులోంచి ప్రయాణిస్తున్న ప్రజలు
మద్నూర్ : మద్నూర్ మండలం మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. సరిహద్దుల్లోని గ్రామాల ప్రజల మధ్య బంధుత్వాలూ ఉంటాయి. ఇక్కడివారికి అక్కడ, అక్కడికివారికి ఇక్కడ వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. మండలంలోని తడిహిప్పర్గా గ్రామ శివారులోని లెండి వాగు అవతలి వైపు మహారాష్ట్ర భూభాగం ఉంది. ఇక్కడ వంతెన లేకపోవడంతో వాగులోంచే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. వాగులో ప్రస్తుతం నడుములోతు వరకు నీళ్లున్నాయి. ఇటువారు అటువైపు వెళ్లాలంటే సుమారు 20 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది. దీంతో ప్రమాదకరమని తెలిసినా ప్రజలు వాగులోంచే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
వంతెన నిర్మించరూ..