భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఆ రోగ్య ఉప కేంద్రం భవన ని ర్మాణ పనులు చేస్తున్న ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో బుధవారం మృతి చెందాడు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రాములు (32) బస్వాపూర్ ఆ రోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేస్తున్నాడు. బుధవారం సెంట్రింగ్ పనులు చేస్తుండగా పైన ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు భిక్కనూరు పోలీసులకు సమాచారం అందించారు.
సిరికొండలో రైతు..
సిరికొండ: మండలంలోని దుప్యతండాకు చెందిన రైతు మలావత్ రమేశ్(45) పొలం వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్సై ఎల్ రామ్ బుధవారం తెలిపారు. పొలానికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన రమేశ్ తిరికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా మోటారు వైరు తగిలి చనిపోయినట్లు గుర్తించారన్నారు. మృతుడి భార్య నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.