భిక్కనూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రితో పాటు పలు చోట్ల వడ దెబ్బ తగులకుండా తీసుకోవాల్సిన చర్యలను ఎంపీహెచ్‌ఈవో వెంకటరమణ సోమవారం అవగాహన కల్పించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు బయట తిరగొద్దని సూచించారు. అలాగే ఎక్కడ పడితే అక్కడ నీటిని తాగవద్దని శుభ్రమైన నీరునే సేవించాలన్నారు. వాంతులు విరేచనాలు అయితే వెంటనే వైద్యసిబ్బందిని సంప్రదించాలన్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను వినియోగించే విధానంపై అవగాహన కల్పించారు.
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపిక
నిజాంసాగర్(జుక్కల్):టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి మహమ్మద్ నగర్ మండలం దూప్‌సింగ్ తండాకు చెందిన కొర్ర వెన్నెల ఎంపికై ంది. రాజన్న సిరిసిల్లా జోన్ పరిధిలో మహిళా విభాగంలో వెన్నెల 180 మార్కులతో మూడో ర్యాంక్ సాధించింది. ఈసందర్భంగా వెన్నెలను తండావాసులు అభినందించారు.
రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి టౌన్ : రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పౌరసరఫరా శాఖ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. ఇంకో 20 రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. తరుగు పేరిట అక్రమాలకు పాల్పడే రైస్‌మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ప్రకాష్, వసంత్ తదితరులున్నారు.
ప్రత్యేకాధికారుల
జాబితాలో మార్పులు
కామారెడ్డి క్రైం: మండల ప్రత్యేకాధికారుల జాబితాలో మార్పులు చేస్తూ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఆరు మండలాలకు కొత్తగా ప్రత్యేకాధికారులను నియమించారు. జుక్కల్ మండలానికి జెడ్పీ సీఈవో చందర్, సదాశివనగర్‌కు భూగర్భ జల శాఖ ఏడీ సతీశ్‌యాదవ్, పాల్వంచకు జిల్లా మత్య్సశాఖ అధికారి శ్రీపతి, గాంధారికి డీపీవో మురళి, మాచారెడ్డికి మిషన్ భగీరథ ఈఈ డి రమేశ్, ఎల్లారెడ్డికి డీఎల్‌పీవో సురేందర్‌ను మండల ప్రత్యేకాధికారులుగా నియమించారు.
నూతనంగా నియమితులైన ప్రత్యేకాధికారులు వారికి కేటాయించిన మండలాల్లో క్రమం తప్పకుండా పర్యటిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మంగళ, శుక్ర వారాల్లో గ్రామాలను సందర్శించాలని సూచించారు. ప్రజాపాలన, తాగు నీరు, ఇందిరమ్మ ఇండ్లు, స్వచ్ఛదనం–పచ్చదనం, పారిశుధ్యం, హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, నర్సరీల నిర్వహణ తదితర ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలని ఆదేశించారు.
వడదెబ్బ నివారణ చర్యలపై అవగాహన
వడదెబ్బ నివారణ చర్యలపై అవగాహన