నస్రుల్లాబాద్(బాన్సువాడ): బాన్సువాడకు చెందిన ఓ వ్యక్తి నస్రుల్లాబాద్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. నస్రుల్లాబాద్ చెరువులో సోమవారం ఓ వ్యక్తి మృతదేహం కనబడటంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు బాన్సువాడ గ్రామానికి చెందిన కొత్తకొండ శ్రీనివాస్(53)గా గుర్తించారు. శ్రీనివాస్ విరిగిన కాలు తీవ్రంగా నొప్పి రావడంతో నిత్యం బాధపడేవాడు. ఈక్రమంలో ఈనెల 14న ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేడు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. కాలు నొప్పి భరించలేకనే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని భార్య అనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.