
విష్ణువర్ధన్‌రెడ్డి(ఫైల్)
బోధన్‌టౌన్: వాగులో స్నానానికి వెళ్లిన ఓ బాలుడు నీట ము నిగి మృతి చెందాడు. ఈ ఘటన బోధన్‌లోని రాకాసీపేట్ కాల నీ శివారులో పసుపు వాగులో చోటు చేసుకుంది. సీఐ ప్రేమ్‌కుమార్ తెలిపిన వివరాలు.. పట్టణంలోని తట్టికోట్ కాలనీకి చెందిన గాంధారి శ్రీకాంత్‌రెడ్డి ప్రస్తుతం సరస్వతినగర్ కాలనీలో ఉంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి(14) తొమ్మిదో తరగతి చదు వుతున్నాడు. ఇద్దరు స్నేహితులు మంగళవారం మధ్యాహ్నం విష్ణువర్ధన్‌రెడ్డి ఇంటికి వచ్చి స్టడీ అవర్ ఉందని చెప్పి తీసుకెళ్లారు. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో విష్ణువర్ధన్‌రెడ్డిని తీసుకెళ్లిన స్నేహితులను అడగ్గా మొదట తమ కు తెలియదని సమాధానం చెప్పారు. బుధవారం ఉదయం మళ్లీ ప్రశ్నించగా ముగ్గురం కలిసి రాకాసీపేట్ శివారులోని పసుపు వాగులో స్నానం చేయడానికి వెళ్లగా విష్ణువర్ధన్‌రెడ్డి మునిగి పోయాడిని చెప్పారు. దీంతో పసుపు వాగు వద్దకు వెళ్లి చూడగా బాలుడి మృతదేహం లభించింది. బాలుడి తండ్రి విష్ణువర్ధన్‌రెడ్డి ఇద్దరు స్నేహితులపై అనుమానం ఉందని చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.