
గాయపడ్డ గంగరాజు
కామారెడ్డిటౌన్: కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్‌పై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి బంధువులు దాడి చేశారు. అడ్డువచ్చిన అతని తమ్ముడిపైనా దాడి చే శారు. వివరాలు.. ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న కాకర్ల గంగారాజు మంగళవా రం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో మెటర్నిటీ వార్డులో ప్రసవం అయి చికిత్స పొందుతున్న బా లింత వద్ద ఉన్న ఇద్దరు వ్యక్తులను బయటకు వెళ్లా లని కోరారు. మహిళల వార్డులో పురుషులు ఉండవద్దని రంజిత్, రాజు అనే ఇద్దరికి చెప్పాడు. దీంతో వారిద్దరు గంగరాజును హాస్పిటల్ నుంచి బయట కు ఈడ్చుకుంటూ వచ్చి తలపై దాడి చేశారు. అడ్డుకున్న ఓ నర్సును దుర్భాషలాడారు. అదే సమయంలో గంగరాజుకు టిఫిన్‌కు తీసుకుచ్చిన అతని తమ్ముడు కాకర్ల భరత్ అడ్డుకోగా అతినిపై కూడా దాడి చేశారు. దీంతో అన్నదమ్ములిద్దరికీ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునేలోపే దాడి చేసిన వ్యక్తులు పరారయ్యారు. గాయపడిన అన్నదమ్ములు ఏరియా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి పట్టణ పోలీసులు తెలిపారు.