
నిజాంసాగర్ (జుక్కల్) : ఎన్నికలకు కార్యకర్తల స మాయత్తం కోసం బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన ఆత్మీ య సమ్మేళన సభపై తేనెటీగల దాడితో ఎమ్మెల్యే హన్మంత్ సింధేతో పాటు భద్రతా సిబ్బంది నాయకులు, కార్యకర్తలు పరుగులు తీశారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని 15 గ్రామాలకు సంబంధించి సావర్‌గావ్ గ్రామంలో కౌలాస్ ఇరిగేషన్ కార్యాలయం పక్కన చెట్ల కింద సభను ఏర్పాటు చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌త్ సింధే మాట్లాడుతుండగా తేనెటీగలు గుంపు సభా ప్రాంగణంలోకి రావడంతో కార్యకర్తలు భ యాందోళనతో పరుగులు తీశారు. తేనెటీగలు కార్యకర్తలను వెంబడించి దాడి చేశాయి. ఎమ్మెల్యే హన్మంత్‌సింధేతో పాటు భద్రతా సిబ్బంది, బీఆర్‌ఎస్ నాయకులు, పత్రికా విలేకరులపై దాడికి దిగా యి. తేనేటీగల దాడిలో గాయపడిన ఎమ్మెల్యే సింధే, భద్రతా సిబ్బంది, నాయకులు నీటిపారుదల శాఖ కార్యాలయంలోకి పరుగులు తీశారు. ఆరగంట తేనెటీగలు వెళ్లిపోవడంతో కొద్ది మంది నాయకులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.
పరుగులు తీసిన కార్యకర్తలు,
నాయకులు
ఎమ్మెల్యే హన్మంత్ సింధేతో పాటు
పలువురికి గాయాలు

నీటిపారుదలశాఖ కార్యాలయంలో తలదాచుకున్న ఎమ్మెల్యే సింధే, నాయకులు