
మాట్లాడుతున్న ఎమ్మెల్యే హన్మంత్ సింధే
నిజాంసాగర్: అభివృద్ధి పనులతో పాటు మహిళలు, రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే పేర్కొన్నారు. మంగళవారం జుక్కల్ మండలం సావర్‌గావ్ గ్రామంలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపుతోందన్నారు. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్, ప్రవసం తర్వాత కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి కింద ఆడ పిల్ల జన్మిస్తే రూ. 13 వేలు, మగబిడ్డ అయితే రూ. 12 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. గురుకులాలను స్థాపించి పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి గడపకు చేరాయన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు నీలు పటేల్, సాయాగౌడ్, మాధవ్‌రావ్ దేశాయ్, శివాజీ పటేల్, రవి పటేల్, అనితా పాటిల్, భాను గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గడపగడపకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి
మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ఆత్మీయ సమ్మేళనంలో
ఎమ్మెల్యే హన్మంత్ సింధే