
స్వచ్ఛంద సేవలందించిన వారికి పురస్కారాలు అందజేస్తున్న ధాత్రి సేవా సంస్థ సభ్యులు
నిజామాబాద్ సిటీ : ధాత్రి సాహితీ సాంస్కృతిక సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అందరికి స్ఫూర్తిగా నిలుస్తాయని ఉప రవాణా శాఖ అధికారి వెంకటరమణ అన్నారు. మంగళవారం ధాత్రి సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గౌతమి డిగ్రీ కళాశాలలో ధాత్రి విశిష్ట సేవారత్న పురస్కారాలు– 2022 పేరుతో కార్యక్రమం నిర్వహించారు. కరోనా సమయంలో సేవలందించిన స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధులకు నగదు పురస్కారాలను అందించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ నేటి యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా మాట్లాడుతూ నిరంతరం సమాజానికి ఏదైనా చేయాలనే తపనతో మల్లవరపు విజయ చేస్తున్న సాహిత్య సామాజిక సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు నగదు పురస్కారాలను ప్రదానం చేశారు. పురస్కారాలు అందుకున్న వారి లో ముత్యం నరేష్ (ఇందల్వాయి), వినయ్ (ఫుడ్‌బ్యాంక్), రమణాచారి (శ్రీలక్ష్మి చేయుత), శ్రీరామ్ నవీన్ చారి(మన ఊరు మన బాధ్యత వెల్ఫేర్ సొసైటీ), డాక్టర్ మద్దుకూరి సాయిబాబు(ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ), పి.నర్సింగ్ రావ్(పోలీస్‌శాఖ)లకు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షురాలు షహీద్మియా, గౌ తమి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అనిల్ కుమార్, తొగ ర్ల సురేశ్, కళాశాల విద్యార్థులు, ధాత్రి సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.