
అమీనాపూర్ సమీపంలో చెరువులకు వెళ్తున్న నీటిని పరిశీలిస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి
వేల్పూర్ : సీఎం కేసీఆర్ వల్ల ఎండాకాలంలో చెరువులు అలుగులు పారుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మోర్తాడ్ పర్యటన ముగించుకొని వేల్పూర్ వెళ్తుండగా అమీనాపూర్ వద్ద కాలువలో ప్రవహిస్తున్న గు త్ప, నవాబు లిఫ్ట్‌ల నీటిని చూసి సంబురపడ్డా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుత్ప, నవాబు లిఫ్ట్‌ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో చెరువులు అలుగులు పారుతున్నాయని పే ర్కొన్నారు. ఈ రెండు లిఫ్ట్‌ల ద్వారా వేల్పూర్ మండలంలో వేల్పూర్, అమీనాపూర్, కుకునూర్, ల క్కోర, కోమన్‌పల్లి, వెంకటాపూర్, అంక్సాపూర్, దొ న్కల్ గ్రామాలలోని 12 చెరువులు మండుటెండల్లో అలుగులు పారడం ఆనందంగా ఉందన్నారు.