రాజమహేంద్రవరం రూరల్: జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి డి.ఫణి భూషణ్‌రెడ్డి, సిబ్బంది గ్రావెల్ అక్రమ తవ్వకాలపై మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ మండల పరిధిలోని మోరంపూడి(శాటిలైట్‌సిటి) గ్రామంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. తవ్వకాలలో వినియోగిస్తున్న పొక్లయినర్‌ను, రవాణాకు వినియోగిస్తున్న రెండు ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేసి స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఈ తనిఖీలలో రాయల్టీ ఇన్‌స్పెక్టర్ డి. జ్యోతిర్మయి, టెక్నికల్ అసిస్టెంట్లు పి.శైలజ, కె. మనీషా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కే.వి. ప్రసాద్ , విఆర్‌వో ఎం. గోపి పాల్గొన్నారు.
యథేచ్ఛగా
నల్లమట్టి తరలింపు
తాళ్లపూడి: మండలంలో మట్టి మాఫియా కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. వేసవికాలంలో ఏటా నల్ల మట్టిని ఇటుకల బట్టీలకు తరలిస్తుంటారు. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ పనులకు మట్టి తొలుతున్నాం అంటూ ఎర్ర మట్టి గ్రావెల్ జోరుగా తరలించారు. మండలంలో తాజాగా ఇటుక బట్టీలకు నల్ల మట్టిని తరలించటం ప్రారంభించారు. గోపాలపురం మండలం భీమోలు చెరువులో మట్టి ప్రతి ఏడాది తవ్వి బట్టీలకు తరలిస్తూ వుంటారు. మట్టి తరలించాలంటే కనీస నిబంధనలు పాటించాల్సి ఉండగా, నల్ల మట్టి రవాణా తమ హక్కు అంటూ ఇటుకబట్టీలు యజమానులు రాత్రి పగలు అనే తేడా లేకుండా మట్టి తరలిస్తున్నారు.
సాక్షి, అమలాపురం: ఎండలు మండే కొద్దీ కొబ్బరి బొండాల ధర ఎగబాకుతోంది. వేసవి ఆరంభంలో అంతంత మాత్రంగా ఉన్న ధర చూసి రైతులు ఆందోళన చెందారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ బొండాల వినియోగం పెరగడంతో పాటు ధర కూడా అంతకంతకూ పెరుగుతుండడంతో వారు స్థిమితపడుతున్నారు. ఈ నెలలో కొబ్బరి బొండాల వినియోగం రెట్టింపైంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు కొబ్బరి బొండాల ఎగుమతి జోరందుకుంది. ఈ రెండు జిల్లాలో సుమారు 1.8 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల నుంచి బొండాల ఎగుమతి ఎక్కువగా ఉంటుంది. జిల్లాలో ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, మామిడికుదురు, అయినవిల్లి మండలాల నుంచి బొండాలను అధికంగా ఎగుమతి చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీలు నమోదవుతుండడంతో వీటి వినియోగం భారీగా పెరిగింది. గత నెలతో పోల్చుకుంటే ధరలు రైతులు ఊహించని విధంగా పెరిగాయి. రైతు వారీ కొబ్బరి బొండాం ధర రూ.25 (రైతు దింపు తీసి ఎగుమతి చేస్తే) వరకు ఉంది. వ్యాపారులే దింపు తీయించుకుంటే రూ.22 చెల్లిస్తున్నారు. మొక్కతోటలో (కాయ సైజు పెద్దగా) ఉండే చోట రూ.35 వరకు ధర వరకు చెల్లిస్తున్నారు. మహా నగరాల్లో లీటరు బొండం నీటి ధర రూ.140 నుంచి రూ.160 వరకు ఉంది. కొబ్బరి ఉత్పత్తి కేంద్రమైన కోనసీమ, కొబ్బరి మార్కెట్ కేరఫ్‌గా నిలిచిన అంబాజీపేటలో కొబ్బరి బొండాం లీటరు నీటి ధర రూ.140 పలుకుతుండడం గమనార్హం.
దిగుబడి తగ్గడం కూడా
ఏప్రిల్–మే నెలలో రావాల్సిన బొండాల దిగుబడి ఇప్పుడు రావడం లేదు. తెల్లదోమ, గత ఏడాది అధిక వర్షాల వల్ల పువ్వులు రాలిపోవడం వంటి కారణాలతో బొండాల సేకరణ తగ్గిపోయింది. ఇది కూడా ధర పెంపునకు కారణమైంది. కొబ్బరి బొండాలకు ధర పెరిగినా సేకరణ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఎగుమతులు అనుకున్న స్థాయిలో లేవని వ్యాపారులు చెబుతున్నారు. గత నెలలో ఆయా జిల్లాల నుంచి రోజుకు 70 ఐషర్లు, లారీల వరకు బొండాలు ఎగుమతి కాగా, దిగుబడి తగ్గడంతో 50 లారీల మించి ఎగుమతి కావడం లేదని రైతులు చెబుతున్నారు. దిగుబడి తగ్గడం వల్ల ఇటీవల కొబ్బరి కాయ ధర పెరిగిన విషయం తెలిసిందే. దీని వల్ల ఇటు కొబ్బరి బొండం, అటు కొబ్బరి కాయల ధర పెరిగినా రైతులలో పెద్దగా సంతృప్తి లేకుండాపోయింది. అయితే మండు వేసవిలో కొబ్బరి బొండం అందుబాటులో లేకుండా పోవడంపై సామాన్యులు నిట్టూరుస్తున్నారు.
కోకోనట్
వాటర్ బాటిల్
ఉష్ణోగ్రతలతో తగ్గిన కొబ్బరి దిగుబడి
ఫలితంగా భారీగా పెరిగిన ధరలు
రైతు వారీ రూ.22 నుంచి
రూ.35 వరకు
లీటరు నీరు రూ.140..
బొండాం రూ.40 నుంచి రూ.50
కోనసీమ జిల్లాలోనే ధరలు అధికం
ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి
అంచనాలకు మించి..
గత మార్చి నెలలో కొబ్బరి బొండం ధర రైతు వారీ రూ.13 నుంచి రూ.15 వరకు ఉండగా, ఏప్రిల్ రెండో వారంలో రూ.17 నుంచి రూ.25 వరకు పెరిగింది. ఈ పెరుగుదల రైతులకు కొంత ఊరటనిచ్చింది. ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్న బొండాలను హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి వంటి పెద్ద నగరాల్లో రిటైల్‌గా రూ.40 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. లీటరు బొండం నీళ్లు రూ.120 వరకు ఉండేది. ఇప్పుడు బొండంతో పాటు, నీళ్ల ధర సైతం అంచనాలకు మించి పెరిగింది.


