● అధినేతతో భేటీ
● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కొరత
● ఉండాల్సింది ఏడుగురు
● ఉన్నది ఒక్కరు
● క్రీడల్లో వెనుకబడుతున్న విద్యార్థులు
ప్రతి మహిళా
పారిశ్రామికవేత్తగా ఎదగాలి
కరప: ప్రభుత్వాలు అమలు చేస్తున్న రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలని జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) జనరల్ మేనేజర్ సీహెచ్ గణపతి అన్నారు. మహిళా శక్తి సంఘాలకు స్థానిక మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్‌ఎంఈ పెర్ఫార్మెన్స్ (ఆర్‌ఏఎంపీ – ర్యాంప్) కార్యక్రమం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల స్థాపనకు రిజిస్ట్రేషన్ చేస్తామని వివరించారు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికే బ్యాంకుల నుంచి రుణాలు, ప్రభుత్వ రా యితీలు లభిస్తాయని తెలిపారు. పలు పథకాల ద్వా రా 45 శాతం రాయితీపై రుణాలందిస్తారన్నారు. డీఆర్‌డీఏ, జిల్లా పరిశ్రమల కేంద్రం సంయుక్త ఆధ్వర్యాన జిల్లావ్యాప్తంగా ఇంతవరకూ రెండు విడతల్లో 44 వర్క్ షాపులు నిర్వహించామని తెలిపారు. వ్యాపారాలు చేసేవారు తప్పనిసరిగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని గణపతి సూచించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంఎస్‌ఎంఈ కార్యకలాపాలను వివరించారు. అనంతరం పలువురు మహిళలకు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసి, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. వర్క్‌షాపులో డీఐసీ ప్రమోషనల్ ఆఫీసర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
● అధినేతతో భేటీ


