ముగిసిన వాలీబాల్ పోటీలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ సహకారంతో కాకినాడ జేఎన్‌టీయూలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్న్‌మెంట్ ఆదివారం రాత్రితో ముగిసింది. జేఎన్‌టీయూకే క్రీడా మైదానంతో పాటు రాజీవ్‌గాంఽధీ ఏంబీఏ కళాశాల, ఆదిత్య సూరంపాలెం కళాశాలలో పోటీలు నిర్వహించారు. ఫైనల్స్‌లో చెన్త్నె మద్రాస్ యూనివర్సిటీపై చైన్నె ఎస్‌ఆర్‌ఏం యూనివర్సిటీ గెలిచింది. రన్నర్‌గా మద్రాస్ యూనివర్సిటీ నిలవగా, కేరళ కాలికట్ యూనివర్సిటీ తృతీయ, భారతీయర్ యూనివర్సిటీ నాల్గో స్థానంలో నిలిచాయి. అంతర్జా తీయ వాలీబాల్ క్రీడాకారుడు ఎంసీహెచ్‌ఆర్ కృష్ణంరాజు, జిల్లా ఎస్పీ బిందుమాధవ్, వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌లు విజేతలకు బహుమతులు అందించారు. రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, స్టూడెంట్స్ ఎఫైర్ డైరెక్టర్ కృష్ణమోహన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్యామ్ కుమార్ పాల్గొన్నారు.


