వైఫల్యాలను మహాత్ములు అవకాశాలుగా మలచుకుంటారు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవ రం రూరల్): వైఫల్యాలను సై తం మహాత్ములు అవకాశాలుగా మలచుకుంటారని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశ ర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవ చనాన్ని గురువారం ఆయన కొ నసాగించారు. ‘శిథిలమై, గొప్ప కోటలు, ఇతర రక్షణ మార్గాలు లేని ఖాండవప్రస్థాన్ని ఏలుకోమని ధర్మరాజుకు ధృతరాష్ట్రుడు సూచిస్తాడు. అయితే, పాండవు లు ఖాండవప్రస్థాన్ని కృష్ణునితో కలసి వెళ్లి, విశ్వకర్మతో సుందర నగరాన్ని నిర్మించుకున్నారు’ అని చె ప్పారు. హస్తినకు వచ్చిన ద్రౌపదిని చూసి గాంధారి ఆమె తన పుత్రుల పాలిట మృత్యుదేవతగా కనిపిస్తున్నట్లు భావించినదన్నారు. పాండవుల కోసం విశ్వకర్మ నిర్మించిన అద్భుతమైన నగరం ‘ఇంద్రప్రస్థం’గా పే రొందిందని, వాణిజ్యవేత్తలు, వివిధ భాషలకు చెంది న ప్రజలు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారని చె ప్పారు. ‘అంత్య కాలంలో కూడా నీవే మాకు గతి’ అంటూ కృష్ణుని పాండవులు ప్రార్థించారని, ‘నిన్ను స్మరింపజేసే విపత్తులు ఎన్ని కలిగినా చింత లేదంటూ కృష్ణుని కుంతి ప్రార్థించిందని అన్నారు. ‘విష్ణుని విస్మరించడమే విపత్తు. స్మరించడమే సంపద’ అని వ్యాసుడు చెప్పాడన్నారు. ‘వంద మంది కౌరవులు, ధృతరాష్ట్రు డు తదితర అనేక మంది శత్రువులున్న ధర్మరాజును అజాత శత్రువుగా ఎలా అంటారని కొందరు అడుగు తారు. ధర్మరాజు పట్ల ఎందరో వైరి భావం కలిగి ఉండవచ్చు. కానీ, ఆయనకు ఎవరి పట్లా శత్రు భావం లేదు. అందుకే ఆయన అజాతశత్రువు’ అని వివరించా రు. సోదరుల మధ్య ఏర్పాటు చేసుకున్న నియమానికి భంగం కలగడంతో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడని, వాటిని పరిశీలిస్తే, కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు, గంగ నుంచి కావేరి వరకూ అఖండ భారతం ఒకటేనని, ఒకే ధర్మం ఉండేదని తెలిపారు. వేదాల్లానే ఆగమాలు కూడా ప్రాచీనమని, మన దేశంలో ఆలయ వ్యవస్థ అనాదిగా ఉన్నదేనని చెప్పారు. ఆర్య, ద్రావిడ తేడాలు కొందరు కుహనా చరిత్రకారుల కల్పితాలేనన్నారు. సుభద్రార్జునుల వివాహం, ఖాండవ వన దహనం, వరుణుడు, అగ్నిదేవుడి నుంచి కృష్ణార్జునులు దివ్యాయుధాలు పొందిన వైనాన్ని సామవేదం వివరించారు. తొలుత భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు స్వాగతవచనాలు పలుకుతూ, మనుష్యత్వం, ముముక్షుత్వం, మహా పురుష సంశ్రయం దుర్లభమంటూ పెద్దలు చెబుతారని, భారత ప్రవచనాలు వినడంలో ఈ మూడూ ఉన్నాయని అన్నారు.


