ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం
● కార్పొరేట్ సంస్థలకు
వైద్య కళాశాలలను దోచిపెట్టే ఎత్తుగడ
● 12న భారీ ర్యాలీలు
● పోస్టర్ ఆవిష్కరణలో దాడిశెట్టి రాజా
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రభుత్వ రంగంలో శ్రీకారం చుట్టిన వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు కూటమి సర్కార్‌పై ప్రజా భాగస్వామ్యంతో పోరుబాటు కొనసాగించాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెటి రాజా పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు వైద్య విద్యను దగ్గరచేస్తే చంద్రబాబు సర్కార్ ఆ విద్యను కార్పొరేట్ సంస్థల గుత్తాదిపత్యానికి అప్పగిస్తోందని ఆక్షేపించారు. శనివారం వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ఈనెల 12న తలపెట్టిన ర్యాలీలకు సంబంఽధించిన ప్రజా ఉద్యమ పోస్టర్‌ను పార్టీ నేతలతో కలిసి రాజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ముందుచూపుతో కేవలం ఐదేళ్ల కాలంలో కేంద్రంతో పోరాడి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో తీసుకువచ్చారన్నారు. ఇందులో ఐదు కాలేజీలను ప్రభుత్వ సొమ్ముతో దాదాపు పూర్తిచేస్తే వాటిని చంద్రబాబు ఒక్క కలంపోటుతో పీపీపీ అంటూ సొంత వారికి కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ కూటమి సర్కార్ తీరుకు నిరసనగా ఇప్పటికే కోటి సంతకాల సేకరణ ప్రజాభాగస్వామ్యంతో ఒక ఉద్యమంగా జరుగుతోందన్నారు. ఇందుకు కొనసాగింపుగా ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా అధికారులకు వినతిపత్రాలు అందచేయనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ విప్పర్తి వేణుగోపాల్, మాజీ మంత్రి, జగ్గంపేట కో ఆర్డినేటర్ తోట నరసింహం, పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రసిడెంట్, పిఠాపురం కో ఆర్డినేటర్ వంగా గీత, మాజీ ఎమ్మెల్యే, కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, రాష్ట్ర కార్యదర్శులు, పార్టీ పరిశీలకులు గుబ్బల తులసీకుమార్, ఒమ్మి రఘురామ్, కొప్పన శివ, పార్టీ జిల్లా అనుబంధ విభాగాల నుంచి మహిళ అధ్యక్షురాలు వర్థినీడి సుజాత, పార్టీ ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, మహిళా రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి దీప్తికుమార్, మహిళా నేతలు మాకినీడి శేషుకుమారి, పి.సరోజ, పార్టీ కాకినాడ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అనిల్‌కుమార్(బన్నీ), బీసీ సెల్ అధ్యక్షుడు అల్లి రాజబాబు, ఎస్‌ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణ, రోకళ్ల సత్య, మధు తదితరులు పాల్గొన్నారు.


